Tiger Nageswara Rao: `టైగర్ నాగేశ్వరరావు` సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!
Raviteja Upcoming Movie: రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో ఎలా ఉందంటే?
Tiger Nageswara Rao Second Song Promo: మాస్ మహారాజా రవితేజ(Raviteja) నయా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు. 1970లలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. పుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ కు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏక్ దమ్ ఏక్ దమ్.. అంటూ సాగిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగానే ఇంప్రెస్ చేస్తోంది.
ఈ మూవీ ద్వారా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. మరో కథానాయికగా గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read: Varun Tej Movie: నెట్‌ఫ్లిక్స్ లోకి ‘'గాండీవధారి అర్జున'’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook