COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Veekshanam: అద్భుతమైన కథతో ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న సినిమా వీక్షణం.. ఈ సినిమాను పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లు రామ్ కార్తీక్ తో పాటు క‌శ్వి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథలో అలరించబోతున్నట్లు దర్శకుడు మనోజ్ పల్లేటి తెలిపారు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా ఈనెల 18వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈరోజు వీక్షణం మూవీ ఈవెంట్ లో భాగంగా సినిమా బృందం కొన్ని హైలెట్స్ ను తెలిపింది. ఇందులో భాగంగా దర్శకుడు మనోజ్ పల్లెకి, మ్యూజిక్ డైరెక్టర్లు పాల్గొన్నారు.



సినిమా గురించి దర్శకుడు మనోజ్ పల్లేటి వివరిస్తూ.. ఆయన రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లోని ఇప్పటికే డీఎఫ్ టీ కోర్స్ పూర్తి చేశారని.. ఆయన అక్కడ స్టడీ చేస్తున్న సమయంలో చాలాసార్లు విక్టరీ వెంకటేష్ను కలిసారని తెలిపారు. అలాగే విక్టరీ వెంకటేష్ మాట్లాడిన అనేక మాటలు ఆయనకు పూర్తి నిచ్చాయన్నారు. గతంలో వెంకటేష్ చెప్పిన కొన్ని మాటలే ఈ సినిమాకు మూలమని తెలిపారు. అక్కడి నుంచి వీక్షణం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చానని మనోజ్ పల్లేటి వెల్లడించారు. అంతేకాకుండా వుడ్ రెడీ చేసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్ను కలిశారని.. కొంతమంది ప్రొడ్యూసర్స్ కొత్త డైరెక్టర్ కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఎలా తీస్తారు అని డౌట్ పడ్డారన్నారు. 


అంతేకాకుండా తను కలిసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ లో కొందరు ఆయనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేశారన్నారు. చాలామంది ప్రొడ్యూసర్ ఆయన స్క్రిప్ట్ బాగుంది అనడంతో ఆ తనలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందని తెలిపారు. ఎందుకంటే తెలుగు సినిమా రంగంలోని ఎంతో పెద్ద పెద్ద నిర్మాతలు తన స్క్రిప్టును మెచ్చడంతో కథలు కంటెంట్ ఉందని అనిపించిందన్నారు. అయితే చివరగా ఊరికి వెళ్లి ప్రొడక్షన్ గురించి ట్రై చేద్దాం అనుకున్నా ఆయన పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి లు కలవడంతో ఇక్కడే మూవీ ప్రారంభించారని తెలిపారు. గతంలో ఆయన జార్జిరెడ్డి తో పాటు అనేక రకాల సినిమాలకు పనిచేశారని.. కామెడీ హర్రర్ అందరూ చూసినప్పటికీ.. ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా చాలా వరకు నవ్వు తెప్పించే సామర్థ్యం కలిగి ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ వీక్షణం సినిమా ద్వారా మెయిన్ లీడ్ ఆర్టిస్టులకు మంచి పేరు లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా మంది కొత్త డైరెక్టర్లు తీసిన విధంగా లేదని కూడా అన్నారు. త్వరలోనే మరికొన్ని సినిమాలు కూడా తన డైరెక్షన్ లోనే అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి వివరిస్తూ..  "నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అనుభవం కలిగిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కీబోర్డ్ డ్రమ్స్ నేర్చుకుంటున్నాను.. అంతేకాకుండా గతంలో సంగీత విద్వాంసుడు కోటి వద్ద కూడా కొన్ని రోజులు పని చేశాను. ఆయన దగ్గర కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఎంఎస్ రాజు నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో నేను కొన్ని సినిమాలకు కూడా మ్యూజిక్ అందించాను. ఇది నాకు రెండో సినిమా కావడం ఎంతో అదృష్టం. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పినట్లు నవరసాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన సినిమాకు మ్యూజిక్ అందించడం నాకు ఎంతో హ్యాపీన అందించింది. ఈ సినిమాలో మూడు సాంగ్స్ ఉన్నప్పటికీ అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీకి నేను ఎంతో కష్టపడి సంగీతాన్ని అంది కాబట్టి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈనెల 18వ తేదీన విడుదల కాబోయే వీక్షణం సినిమా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను" అని మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.