Veera Simha Reddy 10 Days Total Collections: నందమూరి బాలకృష్ణ అభిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఒక పాత్ర సరసన హనీ రోజ్ మరో పాత్ర శాసన శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలై మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వాల్తేరు వీరయ్య  సినిమా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించినా సరే నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే 10 రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా 10 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఈ సినిమా పది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల 95 లక్షలు వసూలు చేస్తే 100 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ఇక ఈ సినిమా పదవ రోజు నైజాం ప్రాంతంలో 24 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 17 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 16 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా 9 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా ఏడు లక్షలు, గుంటూరు జిల్లా ఎనిమిది లక్షలు, కృష్ణాజిల్లా తొమ్మిది లక్షలు, నెల్లూరు జిల్లా ఏడు లక్షలు, మొత్తం 97 లక్షల షేర్ కోటి 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది. పది రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారత దేశంలో నాలుగు కోట్ల 64 లక్షలు, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 65 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల 24 లక్షల షేర్ 121 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది.


ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 73 కోట్ల రూపాయలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా కోటి 76 లక్షలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఈరోజు ఆదివారం కూడా కలిసి రావడంతో బ్రేక్ ఈవెన్ ఒక రోజులోనే పూర్తవుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి.


Also Read: Sunil Villian Roles: పుష్ప దెబ్బకు సునీల్ వెంటపడుతున్న తమిళ తంబీలు.. కానీ?


Also Read: SSMB 28: వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్.. వింటేజ్ మహేష్ మీద కన్నేసిన త్రివిక్రమ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook