Veera Simha Reddy Day 13: మరింత డ్రాప్ అయిన వీర సింహారెడ్డి కలెక్షన్స్.. పఠాన్ ఎంట్రీతో ఇక ఇబ్బందే!
Veera Simha Reddy Day 13 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా 13 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. ఆ వివరాలు
Veera Simha Reddy 13 Days Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ళ పరంగా బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదల ఇప్పటికే 13 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. నేటి నుంచి పఠాన్ సినిమా ఎంట్రీతో ఈ సినిమా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా 13 రోజుల వసూళ్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల 72 లక్షల షేర్, 143 కోట్ల 22 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అదే విధంగా ఈ 13 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి నాలుగు కోట్ల 77 లక్షల షేర్, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 72 లక్షల షేర్ కలిపి మొత్తం 74 కోట్ల 21 లక్షల షేర్, 124 కోట్ల 91 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 73 కోట్ల రూపాయలకు జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 74 కోట్ల రూపాయలను ఫిక్స్ చేశారు. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా 21 లక్షల లాభాలతో దూసుకుపోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమా రూపొందింది, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.
ఇక రెండు పాత్రలకు గాను ఇద్దరు హీరోయిన్లు నటించగా హనీ రోజ్, శృతిహాసన్ ఇద్దరి పాత్రలకి మంచి ప్రాధాన్యత దక్కింది. ఇక ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యాక్షన్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, డాన్స్ ఇలా అన్ని విభాగాలలో బాలకృష్ణ ఆకట్టుకోవడంతో సినిమా మీద అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా తమ ప్రేమను కురిపించారు.
Also Read: Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?
Also Read: Nagachaitanya Movie: పరశురామ్ కి హ్యాండిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook