Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య సినిమాలో పోటీ పడిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా బాలకృష్ణ సినిమాని ఆయన అభిమాని గోపీచంద్ మలినేని, వాల్తేరు వీరయ్య సినిమాని చిరంజీవి అభిమాని బాబీ తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శృతిహాసన్ నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి అని ప్రకటించిన వాటి నుంచి రెండు సినిమాల మధ్య అనేక రకాల పోలికలు పెడుతూ వస్తున్నారు అభిమానులు, సాధారణ ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకటి 12 రోజుల థియేటర్ చేసుకుంటే మరొకటి 13 రోజుల థియేటర్ చేసుకుంది. దాదాపుగా ఈ రోజుతో ఈ సినిమాల వసూళ్లకు బ్రేక్ పడినట్టు అవుతుంది. షారుఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్లను ఆ సినిమాకు కేటాయించారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది.


సో ఇప్పటివరకు ఈ రెండు సినిమాల మధ్య ఉన్న కలెక్షన్స్ తేడా ఎంత అనేది పరిశీలిద్దాం. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజులకు గాను 63 కోట్ల 72 లక్షల షేర్, 143 కోట్ల 22 లక్షల గ్రాస్ వసూళ్లు చేయగా కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి నాలుగు కోట్ల 77 లక్షల షేర్, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 72 లక్షల షేర్ కలిపి మొత్తం 74 కోట్ల 21 లక్షల షేర్, 124 కోట్ల 91 లక్షల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 73 కోట్ల రూపాయలకు జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 74 కోట్ల రూపాయలను ఫిక్స్ చేశారు దాన్ని బ్రేక్ చేసిన ఈ సినిమా 21 లక్షల లాభాలతో దూసుకుపోతోంది.


ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి దాదాపు 12 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు గాను 98 కోట్ల 13 లక్షల షేర్, 159 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లు లభించాయి. అలాగే 12 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారతదేశంలో ఏడు కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ లో 12 కోట్ల 62 లక్షలు వాల్తేరు వీరయ్య సినిమా వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 రోజులకు గాను 118 కోట్ల 35 లక్షల షేర్, 202 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టి 29 కోట్ల 35 లక్షల లాభాలు తెచ్చుకొని సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా వీర సింహా రెడ్డి కంటే 44 కోట్లు ముందంజలో ఉంది.


Also Read: Waltair Veerayya Day 12: వాల్తేరు వీరయ్య జోరు ఎక్కడా తగ్గట్లే.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?


Also Read: Veera Simha Reddy Day 13: మరింత డ్రాప్ అయిన వీర సింహారెడ్డి కలెక్షన్స్.. పఠాన్ ఎంట్రీతో ఇక ఇబ్బందే!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook