Veera Simha Reddy 7 Days Collections: బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో వీర సింహా రెడ్డి.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలంటే!
Veera Simha Reddy One Week Worldwide Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం ఎంత కలెక్ట్ చేయాలి అనేది పరిశీలిద్దాం. ఆ వివరాలు
Veera Simha Reddy 7 Days Worldwide Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. అయితే వీర సింహారెడ్డి సినిమా ఊహించిన మేర సినిమా వసూళ్లు రాబట్టకపోయినా వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే కాస్త వెనకబడినా బాలయ్య మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడనే చెప్పాలి.
ఇక ఈ సినిమా వారం రోజుల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే మొదటి రోజు పాతిక కోట్ల 35 లక్షలు, రెండో రోజు ఐదు కోట్ల పాతిక లక్షలు, మూడో రోజు ఆరు కోట్ల 45 లక్షలు, నాలుగో రోజు ఏడు కోట్ల పాతిక లక్షలు, అయిదవరోజు ఆరు కోట్ల పాతిక లక్షలు ఆరవ రోజు నాలుగు కోట్ల 80 లక్షలు, ఏడవ రోజు మూడు కోట్ల 16 లక్షలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల 51 లక్షల షేర్, 94 కోట్ల 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇక ఏడవ రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 69 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 60 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 57 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 40 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 23 లక్షలు, గుంటూరు జిల్లా 21 లక్షలు, కృష్ణాజిల్లా 28 లక్షలు, నెల్లూరు జిల్లా 18 లక్షలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా వారం రోజులకి కర్ణాటక సహా మిగతా భారతదేశంలో నాలుగున్నర కోట్లు వసూలు చేస్తే ఓవర్సీస్ లో మాత్రమే ఐదున్నర కోట్లు వసూలు చేసింది.
అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 68 కోట్ల 51 లక్షల షేర్ వసూలు చేస్తే 114 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా 73 కోట్ల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా ఇంకా ఐదు కోట్ల 49 లక్షల వసూలు చేస్తే బ్రేక్ ఈవెంట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే అది పెద్ద విషయం ఏమీ కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read: Re Releases from Tollywood: తొలిప్రేమ, సింహాద్రి సహా రీ రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!
Also Read: Waltair Veerayya Day 6: ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన వీరయ్య.. ఎన్ని కోట్ల లాభమంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook