Venkatesh Saindhav Movie Update: విక్టరీ వెంకటేష్ (Venkatesh) టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్' (Saindhav). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో  తెరకెక్కుతోంది. ఇది వెంకీ కెరీర్ లో 75వ మూవీ. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిక్,  శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కీ రోల్స్ పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ లెవల్లో అంచనాలను పెంచేశాయి. పైగా వెంకీ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న యాక్షన్ సినిమా కావడంతో ఆడియెన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేజర్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య 16 రోజులుపాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో ఎనిమిది మంది కీలక నటులతో హైఓల్టేజ్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్‌ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు చిత్రబృందం తెలిపింది. 



ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బ్లాక్ మ్యాజిక్ కీలకపాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా శైలేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. థ్రిల్లర్‌ సినిమాలను తెరకెక్కించడంలో శైలేష్ దిట్ట. గతంలో హిట్ సిరీస్‌తో ఇదే విధంగా సూపర్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుత మూవీలో జంప్‌ స్కేర్‌ సీన్స్‌ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. వెంకటేష్ సోల్ హీరో హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. మరి ఈ మూవీతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి. 


Also Read: Akshay kumar: ఓ మై గాడ్ 2 చుట్టూ వివాదం, అక్షయ్ కుమార్‌పై 10 లక్షల రివార్డు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook