విక్టరీ వెంకటేష్, రానాదగ్గుబాటి కలిసి ఎప్పుడూ నటించలేదు. ఆ రోజు వస్తుందేమో అని చాలాకాలం నుంచి సినీ ప్రేమికులు వేచి చూస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఫుల్ లెంత్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు వేచి చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!


రానా, వెంకటేష్ ( Venkatesh ) కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం కోసం సురేష్ బాబు చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాడట. అయితే మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నాడట. తమ్ముడు, తనయుడు ఇద్దరూ కలిసి నటించే విధంగా, అంత దమ్మున్న మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతన్నానడట.


అయితే ఇటీవలే ఒక స్క్రిప్ట్ చదివిని రానా ( Rana Daggubati ) దానిని ఫైనల్ చేశాడని తెలుస్తోంది. బాబాయ్ అబ్బాయి కలిసి నటించేందుకు ఆ కథ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాడట.


Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!


ఈ కథను తండ్రి సురేష్ బాబుకు పంపించాడట. అంగీకరిస్తే ముందుకు వెళ్లేలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడట. అయితే దీనికి సురేష్ బాబు ఎస్ చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది అని వినిపిస్తోంది. ఈ కథను బాలీవుడ్ దర్శకుడితో తెరకెక్కించాలి అని, అంతర్జాతీయ స్టాండర్ట్స్ తో తీయాలని రానా భావిస్తున్నాడు రానా.



Also Read  | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్  Deactivate అవుతుంది!


పలు భాషల్లో విడుదల చేయాలి అనుకుంటున్నాడని సమాచారం. సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఈ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR