Saindhav Teaser Out: విక్టరీ వెంకటేశ్ (Venkatesh) లేటెస్ట్ మూవీ సైంధవ్(SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం వెంకటేష్ కు 75వ మూవీ కావడం విశేషం. ఇప్పటికే రిలీజైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో వెంకీ తన యాక్షన్ తో కుమ్మేశాడు. సైంధవ్ లో వెంకీకి జోడాగా శ్రద్ధా శ్రీనాథ్ నటించగా.. రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్, బేబీ సారా తదితరుల కీలకపాత్రలు పోషించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ఇది. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ఏరియా బ్యాక్డ్రాప్లో ఈ టీజర్ మొదలవుతుంది. ప్రచార చిత్రం మెుత్తం వెంకీ యాక్షన్ తో నిండిపోయింది. ఇందులో వెంకీ సైకోగా కనిపించనున్నాడు. టీజర్ లో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దీఖీ. ఈసినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.



ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్‌.మణికందన్‌ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల దశలో ఉంది. ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. సలార్ కారణంగానే సైంధవ్ తన రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సి వచ్చింది. 



Also Read: Sreeleela: శ్రీ లీలాకి, అనిల్ రావిపూడికి ఉన్న పర్సనల్ సంబంధం ఏమిటో తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి