Venkatesh Next Movie: మిగతా హీరోలతో పోలిస్తే.. సీనియర్ హీరో.. విక్టరీ వెంకటేష్.. కొత్త దర్శకులతో సినిమాను చేయడం చాలా తక్కువ. కథ, స్క్రీన్ ప్లే మరీ అంతా బాగుంటే.. తప్ప వెంకటేష్ కొత్త డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. ఎప్పుడో గతంలో ప్రేమించుకుందాం రా సినిమాతో.. జయంత్ సి, గణేష్ సినిమాతో.. తిరుపతి స్వామిని.. ఇండస్ట్రీకి పరిచయం చేశారు వెంకటేష్. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ తరువాత వెంకటేష్ కొత్త డైరెక్టర్ తో.. సినిమాలు చేసిన దాఖలాలు లేవు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజా సమాచారం ప్రకారం.. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఒక యువ డైరెక్టర్ వెంకటేష్ ని.. కథతో ఇంప్రెస్స్ చేసినట్లు తెలుస్తోంది. యువ హీరో శ్రీవిష్ణు నటించిన సామజ వరగమన సినిమాకి రచయితగా పనిచేసిన వాళ్లలో.. నందు అనే ఒక వ్యక్తి.. సురేష్ బాబు వెంకటేష్ లకి ఒక మంచి కథ.. చెప్పారట. వెంకటేష్ కి కథ బాగా నచ్చడంతో ఓకే చేసేసారని తెలుస్తోంది. 


ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పని.. పూర్తవుతోంది. మరోవైపు వెంకటేష్.. రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తవగానే సీజన్ 3 కూడా మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. దిల్ రాజు.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


జూలై మొదటి వారం నుంచి.. ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది ఈ సినిమా.. విడుదల కాబోతోంది. అంటే ఐదు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోవాలి. దానికి తగ్గట్టుగానే చిత్ర బృందం షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా కి సంబంధించిన.. వివరాలు త్వరలో వెలువడనున్నాయి. 


ఈ సినిమాలు పూర్తయ్యేలోపు నందు ఫైనల్ వర్షన్ తో స్క్రిప్ట్ ఓకే చేస్తే.. ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే మల్లీశ్వరి లాగా ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వెంకటేష్ ని అలాంటి కథలో చూసి చాలా కాలం అయింది. దీంతో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి