Venkatesh Warning: నెట్ ఫ్లిక్స్ కు వెంకీ మామ వార్నింగ్.. నా పేరే పెట్టాలంటూ వీడియో రిలీజ్!
Venkatesh Warning to Netflix: విక్టరీ వెంకటేష్ ఆయన సోదరుడి కుమారుడు రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోన్న క్రమంలో వెంకటేష్ వార్నింగ్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Venkatesh Warning to Netflix: విక్టరీ వెంకటేష్ ఆయన సోదరుడి కుమారుడు రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ ని ఒక అమెరికన్ సిరీస్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి, వెంకటేష్, దగ్గుబాటి, సుచిత్ర పిళై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు.
హిందీ, తెలుగు భాషలలో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది. తాజాగా ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి గురించి నెట్ ఫ్లిక్స్ గురించి వెంకటేష్ దగ్గుబాటి వార్నింగ్ ఇస్తూ చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హిందీలో మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గుబాటి వెంకటేష్ నెట్ ఫ్లిక్స్ మీద కోపంగా అసలు అలంటి పెద్ద తప్పు చేయకు నెట్ ఫ్లిక్స్ అంటూ మొదలు పెట్టారు. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ లో హీరో ఎవరు? నేను, స్టార్ ఎవరు? అది కూడా నేనే, అందంగా కనిపించేది ఎవరు? నేనే, ఫ్యాన్స్ కూడా నా వాళ్లే కాబట్టి ఈ షో పేరు కూడా నా పేరే ఉండాలి.
నాగ నాయుడు అనే పేరుతో షో ఉండాలి, తండ్రితోనే ఢీ కొట్టాలని అనుకోకు, ఏమైనా ఉంటే సరదా సరదానే సీరియస్ సీరియస్ ఏ అన్నట్లుగా ఆయన చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో రానా నాయుడు పేరుతో రానా కనిపిస్తూ ఉండగా నాగ నాయుడు పేరుతో వెంకటేష్ దగ్గుబాటి కనిపించబోతున్నారు. ఈ సిరీస్ కి 2021 సెప్టెంబర్ నెలలో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ లోని ఈ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇక ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ మే 2022లో పూర్తయింది.
Also Read: Amigos First Weekend: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వీక్ గానే.. అమిగోస్ ఎంత రాబట్టింది అంటే?
Also Read: SSMB 28: మహేష్ కోసం స్ట్రాంగ్ విలన్ ను సెట్ చేసిన త్రివిక్రమ్.. హ్యాట్రిక్కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook