Venky Kudumula to direct Mega Star Chiranjeevi: టాలీవుడ్ 'మెగాస్టార్' చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేశారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. ఇటీవలే 'భోళా శంకర్' సినిమాను కూడా ప్రారంభించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక చిరంజీవి తన తదుపరి చిత్రాన్నియువ  డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్‌లో గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరి దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ సినిమా చేయనున్నారని మంగళవారం అఫీషియల్ అనౌన్స్‏మెంట్ వెలుబడింది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 'మెగాస్టార్‌ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా కల నిజమైంది. సహ నిర్మాత డా. మాధవి రాజు' అని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ట్వీట్ చేసింది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య  (DVV Danayya) నిర్మించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.


Also Read: Naga Chaitanya: నా ఫ్యామిలీని అస్సలు ఇబ్బంది పెట్టను.. సమంతపై సెటైర్లు పేల్చిన నాగ చైతన్య!!




మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా చేస్తున్నందుకు డైరెక్టర్ వెంకీ కుడుముల సంతోషం వ్యక్తం చేశారు. 'ఇలాంటి అవకాశాలు జీవితాల్లో ఒక్కసారే వస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన చిరు సార్‌కు ధన్యవాదాలు. నాపై మీకున్న నమ్మకం మరియు మీ పట్ల నాకున్న అభిమానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తా. చిరు సార్ నమ్మకాన్ని నిలబెడుతా. డీవీవీ దానయ్య, డా. మాధవి రాజు గారికి ధన్యవాదాలు' అని వెంకీ కుడుముల ట్వీట్ చేశారు. ఛలో, భీష్మ లాంటి సినిమాలతో వెంకీ మంచి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 


వెంకీ కుడుముల చెప్పిన క‌థ‌ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి బాగా నచ్చడంతోనే ఈ సినిమాకు ఓకే చెప్పారట. చిరు 156వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna)ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఛలో సినిమాతో వెంకీతో ఇప్పటికే రష్మిక పనిచేసిన విషయం తెలిసిందే. రష్మిక తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం వెంకీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 


Also Read: Viral Video: పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు జరిపిన కొత్త జంట.. రంగంలోకి దిగిన పోలీసులు




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook