Vennela Kishore - Manchu Vishnu : అసహ్యంగా చూస్తున్న వెన్నెల కిషోర్.. మంచు విష్ణు చేష్టలే కారణమా?
Vishnu Manchu Dinner మంచు విష్ణు తాజాగా డిన్నర్ ప్లాన్ చేశాడట. కానీ చెప్పిన టైంకి మాత్రం అవతలి వ్యక్తి రాలేదట. దీంతో మంచు విష్ణుకి మండిపోయింది. ఆ వ్యక్తి ఎవరో చెప్పండంటూ గెస్ చేయమని అడిగాడు.
Vishnu Manchu Dinner : మంచు విష్ణు తాజాగా డిన్నర్ పార్టీని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఓ టైం ఫిక్స్ చేశాడట. కానీ అవతలి నుంచి రావాల్సిన వ్యక్తి మాత్రం టైంకు రాలేదట. దీంతో అతని మీద కోప్పడుతున్నట్టుగా ఓ ట్వీట్ పెట్టేశాడు. ఇంతకీ అతను ఎవరో గెస్ చేయండి అంటూ ఓ ట్వీట్ వేశాడు వెన్నెల కిషోర్. అయితే అందులో యారగెంట్ అనే పదాన్ని చూడటంతో.. అది వెన్నెల కిషోర్ గురించి అయి ఉంటుందని నెటిజన్లు గెస్ చేశారు.
దీంతో కొద్ది సేపటికి వెన్నెల కిషోర్ ఫోటోను షేర్ చేశాడు. ఇతడే అతడు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో వెన్నెల కిషోర్ మాత్రం కాస్త వింతగా, అసహ్యంగా చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలో వెన్నెల కిషోర్‌ను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందులో కొందరు మాత్రం ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మంచు విష్ణు అన్నా.. బిల్ కట్టమని అన్నాడేమో.. అందుకే వెన్నెల కిషోర్ భయ్యా అలా చూస్తున్నాడంటూ వెన్నెల కిషోర్ మీద కౌంటర్లు వేయసాగారు. అయితే జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా వెన్నెల కిషోర్ గురించి ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యారగెంట్ ఫెలో, అహంకారం అంటూ ఇలా నానా రకాలుగా తిట్టిపోస్తూ వీడియోను రిలీజ్ చేశాడు.
దీనిపై నానా రచ్చ కూడా జరిగింది. కానీ అదంతా కూడా వెన్నెల కిషోర్ మీద ప్రేమతో చేశాడని అందరికీ అర్థమైంది. వెన్నెల కిషోర్ అంటే తనకు ఇష్టమని, మంచి వ్యక్తి అని, కానీ చాలా యారగెంట్ అంటూ ఇలా పలు సార్లు స్టేజ్ మీద కూడా చెప్పేశాడు మంచు విష్ణు. జిన్నా సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే.
జిన్నా సినిమాకు అంతో ఇంతో పాజిటివ్ రివ్యూలు వచ్చాయంటే.. అది కేవలం వెన్నెల కిషోర్ చమ్మక్ చంద్ర కామెడీ వల్లే. ఈ ఇద్దరి ట్రాక్‌కు థియేటర్లో జనాలు పగలబడి నవ్వేశారు. చివరకు జిన్నా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నట్టు అయింది.
Also Read : Waltair Veerayya songs : అమ్మడు కుమ్ముడుని మించేలా.. రవితేజతో చిరు స్టెప్పులు.. శేఖర్ మాస్టర్ సందడి
Also Read : Yashoda Movie First Review : లోలోతుల్లో తడిమేశావ్!.. సమంత యశోద రివ్యూ చెప్పిన తమన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook