Rashmika Mandanna-Vijay Devarkonda : విజయ్ వల్ల రష్మిక నన్ను దూరం పెట్టింది.. వాళ్ళిద్దరికీ విడాకులు ఖాయం: వేణు స్వామి.. : టాలీవుడ్ సెలబ్రిటీల సినీ కరియర్ ఇలా ఉంటుంది, వారి వ్యక్తిగత జీవితం ఇలా ఉండబోతుంది అని అంటూ వేణు స్వామి ఎప్పటికప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ విషయం లో జ్యోతిష్యం చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత, నాగ చైతన్య విషయంలో తన జ్యోతిష్యం కరెక్ట్ అయ్యింది అని హడావిడి చేసిన వేణు స్వామి ప్రభాస్ కెరియర్ గురించి చేసిన జ్యోతిష్యం తప్పు అయినప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. తాజాగా వేణు స్వామి ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని జ్యోతిష్యం చెప్పి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


గీత గోవిందం సినిమా సెట్స్ పై మొదటిసారి కలుసుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ల మధ్య ప్రేమ చిగురించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. డియర్ కామ్రేడ్ సినిమా లో కూడా కలిసి నటించిన ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది అని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ జంట పెళ్లి బంధం తో ఒకటి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ ఛానల్ లో వేణుస్వామి ఇంటర్వ్యూ లో భాగం గా  యాంకర్ వేణుస్వామి ని విజయ్ దేవరకొండ మరియు రష్మిక ల పెళ్లి తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది అని అడగగా, వేణుస్వామి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని, వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అని అన్నారు. 


వారి జాతకాలను కూడా పరిశీలించాను అని చెప్పిన వేణు స్వామి పెళ్లైన తర్వాత కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోతారని జ్యోతిష్యం చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో నేరుగా రష్మిక కే చెప్పారట, కానీ ఆమెకు ఈ విషయం నచ్చలేదని, ఈ విషయం లో వారి మధ్య గొడవ కూడా జరిగింది అన్న వేణు స్వామి అప్పటిదాకా తన క్లైంట్ గా ఉన్న రష్మిక అప్పటి నుంచి దూరాన్ని మెయింటైన్ చేస్తోంది అని అన్నారు.


నాగచైతన్య మరియు సమంత ల లాగా ఈ జంట కూడా వివాహం చేసుకున్న తర్వాత విడిపోతారా అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే ఖుషి తో హిట్ అందుకున్న విజయ్ త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మిక తాజాగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుని ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉంది.


Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు


Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం


 


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook