Vetrimaaran Jr NTR Movie ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద అందరి దృష్టి పడింది. ఇంటర్నేషనల్, నేషనల్ మేకర్లు అంతా కూడా ఎన్టీఆర్‌ పొటెన్షియల్‌ మీద మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్ లైనప్‌ కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలానే ఉంది. కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తోన్న ప్రాజెక్ట్ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో షూటింగ్ మొదలవ్వాల్సిన ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు కొరటాల శివ సినిమా ముందుకు కదులుతోంది. మార్చిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొత్త సినిమాకు సంబంధించిన గాసిప్ బయటకు వచ్చింది. వెట్రిమారన్‌తో సినిమా చేయబోతోన్నాడంటూ ఎన్టీఆర్ మీద ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


ఎన్టీఆర్ కోసం మూడు కథలు వినిపించాడని, అందులో ఓ కథను ఓకే చేశాడట.. అయితే ఆ సినిమాను రెండు పార్టులుగా తీయబోతోన్నారని, అందులో ఎన్టీఆర్.. మరో దాంట్లో ధనుష్‌ నటిస్తున్నాడట. మొత్తానికి ఈ గాసిప్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్‌లో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇది నిజం అవుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే..  ఎన్టీఆర్ గతంలో వెట్రిమారన్‌ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అసురన్ సినిమాను తీసిన విధానం, అందులోని కమర్షియల్ అంశాలను చూపించిన విధానానికి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడట. వెట్రిమారన్‌తో సినిమా తీయాలని అనుకుంటున్నట్టుగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.


Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్


Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి