Vicky Kaushal Sam Bahadur Teaser: కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ఆడియెన్స్ అలరిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో విక్రీ కౌశల్.  ఎక్కువగా దేశభక్తి చిత్రాలతో చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు విక్కీ. తాజాగా సామ్ బహదూర్ (Sam Bahadur Movie) అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు విక్కీ కౌశల్. సర్దార్ ఉద్దమ్ తర్వాత విక్కీ నటిస్తున్న బయోపిక్ ఇది.  1971లో ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ యుద్ధంలో భారత్ విజయానికి కారణమైన "సామ్ మానెక్షా" (Sam Manekshaw) జీవిత కథ ఆధారంగా ఈ సామ్ బహదూర్ మూవీ తెరకెక్కుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో సామ్ మానెక్ష పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో దంగల్ బ్యూటి సనా ఫాతిమా షేక్ కనపించనుంది. తాజాగా సామ్ బహదూర్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో విక్కీ బాడీ లాంగ్వేజ్ చాలా రియలిస్టిక్ గా ఉంది. సైన్యానికి విక్కీ ట్రైనింగ్ ఇవ్వడాన్ని ఇందులో చూపించారు.  అంతేకాకుండా ఇందిరా గాంధీ, సామ్ బహదూర్ మధ్య సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 01న రిలీజ్ కానుంది. ఫీల్డ్ మార్షల్ గా సామ్ జంషద్ జీ మానెక్షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశబ్దాల పాటు ముందుండి నడిపించారు. ఈయన్ను భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 



Also Read: Vyooham Trailer: ఏపీలో పొలిటికల్ హీట్ పెంచబోతున్న ఆర్జీవీ.. ఇంట్రెస్టింగ్‌గా 'వ్యూహం' ట్రైల‌ర్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి