Venkatesh Affairs Revealed By Director: తెలుగులో నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ హీరోయిన్ గా సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన గీతాకృష్ణ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించారు. కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, టైం, కాఫీ బార్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. చివరిగా తమిళంలో నిమిడంగల్ అనే ఒక సినిమాకి డైరెక్ట్ చేసిన ఆయన ఆ తర్వాత ఎందుకో దర్శకత్వానికి దూరంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ సమయం గడిపేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన విక్టరీ వెంకటేష్ మీద, రానా మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో విక్టరీ వెంకటేష్ రానా ప్రధాన పాత్రలలో రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ గా దీన్ని రూపొందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సిరీస్ బాగా బోల్డ్ గా ఉందని విక్టరీ వెంకటేష్ మార్క్ సిరీస్ కాదని ఆయన సినిమాలు చూసే ఫ్యామిలీస్ అందరూ ఈ సిరీస్ చూస్తే ఇబ్బంది పడడం తప్పదని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.


ఇదీ చదవండి: Samantha vs Naga Chaitanya: పాపం నాగచైతన్య కలెక్షన్స్ టచ్ చేయలేకపోయిన సమంత?


ఇదే విషయం మీద స్పందించిన గీతాకృష్ణ ఆ బోల్డ్ వెబ్ సిరీస్ తీస్తే ఏమిటని ప్రశ్నించారు. నిజ జీవితంలో వెంకటేష్ గాని, రానా కానీ అంత పవిత్రులేమీ కాదు అని అంటూనే వాళ్లు తమకు నచ్చిన కథ వెబ్ సిరీస్ గా చేసే అవకాశం ఉంది అలాంటప్పుడు దాన్ని చూసేందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రానా అయితే చాలామంది అమ్మాయిలతో టైంపాస్ చేసేవాడని ఆయన తమ్ముడు, అభిరామ్ కూడా ఒక థర్డ్ గ్రేడ్ నటి తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని అంటూ ఆయన కామెంట్లు చేశారు.


అయితే రానా గురించి గతంలో సుచీ లీక్స్ లో కూడా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి మరకలు లేని విక్టరీ వెంకటేష్ మీద గీతా కృష్ణ చేసిన కామెంట్లతో ఆయన మీద వెంకటేష్ అభిమానులు, సినీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. విక్టరీ వెంకటేష్ గురించి ఏమి తెలుసు అని ఆయన కామెంట్లు చేశారు? అయినా విక్టరీ వెంకటేష్ కి ఎఫైర్ లు ఉన్న ఆ విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలు.


ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని విక్టరీ వెంకటేష్ ఇలా టార్గెట్ చేసి మీరు ఎలా మాట్లాడుతారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే రానా నాయుడు విడుదలై చాలా రోజులు అయినా ఈ విషయంలో వెంకటేష్ మాత్రం టార్గెట్ అవుతూనే ఉన్నాడని చెప్పక తప్పదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి తెలుగు వెర్షన్ డిలీట్ చేశారు. తెలుగు ఆడియో కాకుండా హిందీ సహా మిగతా భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది..


ఇదీ చదవండి: Samantha vs Lawrence: పని చేయని సమంత మ్యాజిక్.. ఆ ఏరియాల్లో రచ్చ రేపిన లారెన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook