HBD Venkatesh విక్టరీ వెంకటేష్ సినిమాలకు ఇప్పటికీ గిరాకీ ఉంది. 90వ దశకంలో వెంకటేష్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ వెంకీమామ అందరినీ అలరించాడు. అయితే వెంకీ మామ తన కెరీర్‌లో ఎక్కువగా ప్రయోగాలు చేశాడు. దాంతో పాటు కాస్త సేఫ్ గేమ్ కూడా ఆడినట్టు అనిపిస్తుంది. పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో అంటే అంతగా సోషల్ మీడియా వాడుకలో లేదు కాబట్టి.. అవి రీమేక్ సినిమాలని ఎక్కువగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ వెంకీ మామకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లన్నీ కూడా దాదాపు రీమేక్ సినిమాలే. అలా చంటి సినిమా కూడా రీమేక్‌ చేశాడు వెంకటేష్. ఇప్పటికీ వెంకటేష్ రీమేక్‌ల మీద ఆధారపడుతూనే ఉన్నాడు. నారప్ప, దృశ్యం సినిమాలు కూడా రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే.


అయితే వెంకీమామ రీమేక్ చేస్తే వచ్చే ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అది అచ్చం తెలుగు సినిమాలనే అనిపిస్తుంది. అదే వెంకీమామలో ఉన్న స్పెషాల్టి. అలా వెంకటేష్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 25 రీమేక్‌లు చేశాడు. అందులో దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్లే.


ఇక ఇప్పుడు వెంకీ మామ రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో రెడీగా ఉన్నాడు. అది కాకుండా ఇంకొన్ని సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. చివరగా ఎఫ్ 3 అంటూ అందరినీ నవ్వించేశాడు. ఇక వెంకీ మామలోని ఆధ్యాత్మిక కోణం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ దైవ చింతనలోనే గడిపేస్తాడు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. తన ఫ్యామిలీని సైతం మీడియాకు దూరంగా ఉంచుతాడు. తన పర్సనల్ లైఫ్‌కు ఎంతో టైం కేటాయిస్తాడు వెంకీ మామ.


Also Read : VK Naresh Defamation Case : యూట్యూబ్‌ ఛానళ్లపై కేస్.. ట్రోల్స్ మీద పవిత్ర-నరేశ్‌ యుద్దం


Also Read : Pragathi Workouts : బీస్ట్ మోడ్.. భారీ వర్కౌట్లు.. ప్రగతి వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook