Venkatesh New Movie: జాతి రత్నంతో విక్టరీ వెంకటేష్..? త్వరలో అధికారిక ప్రకటన
F-3 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రం `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ తో అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. వేచి చూడాలసిందే!
Venkatesh New Movie with Director Anudeep KV: తెలుగు సినీ రంగంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతిరత్నాలు డైరెక్టర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రస్తతం విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న F-3 చిత్రం షూటింగ్ పూర్తై స్పీడ్‌గా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. అంతే వేగంతో మూవీ ప్రమోషన్లు జరుగుతున్నట్లు సమాచారం.
అన్ని పనులు తొందరగా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం అనుకుంటోంది. దీంతో అన్ని పనులు చకచక పూర్తి చేస్తున్నారిని చిత్ర బృందం వెల్లడించింది. ఈ తరుణంలోనే మరిన్ని చిత్రాలకు సంబంధించిన నూతన ప్రాజెక్ట్‌లను కూడా ప్రకటించే ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలోని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జాతిరత్నాలు దర్శతకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరిని వెంకీకి చెప్పాగా.. వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ నినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సినీ బజ్‌లో టాక్. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎంతో పేరున్న వెంకీ... ఈ మూవీతో మరింతగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చలు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రెండు భాషల్లో ఒక సినిమా రూపొందుతోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దశలో ఉందని సమాచారం. ఈ మూవీ పూర్తి కాగానే వెంకటేష్‌తో చేసే చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడే చాన్స్ ఉంది.
Also Read: Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం
Also Read: Banks Privatization: ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ త్వరలోనే, కేంద్రం కీలక చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook