Vidudala Part 2: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడస్తుంది. ఒక సినిమా హిట్టైయిందంటే చాలు.. వెంటనే ఆ సినిమాకు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విడుదల’ మూవీకి సీక్వెల్ గా ‘విడుదల 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు తమిళంలో "విడుదల 2" ఫస్ట్ లుక్ రిలీజైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ - విడుదల పార్ట్ 1 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడీ విడుదల 2 మూవీకి అంతకు మించి ఉంటుందని హామి ఇస్తున్నాను.  ఈ చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్  దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. యాక్టర్ సూరికి విడుదల పార్ట్ 1 మూవీ సక్సెస్ ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రంగా ‘విడుదల 2’పై ప్రేక్షకుల్లో  మరింత హైప్ క్రియేట్ అయింది.  ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా విడుదల 2 సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామన్నారు. దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించారు.  స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న విడుదల 2 సినిమాను ఈ ఏడాది చివరలో థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు విడుదల 2లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో ,విడుదల తేదిని  త్వరలో అనౌన్స్ చేస్తాం.


నటీనటులు - విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ తదితరులు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - ఆర్ వేల్రాజ్,ఎడిటర్ - రామర్,మ్యూజిక్ - ఇళయరాజా,పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్),
నిర్మాత - ఎల్రెడ్ కుమార్, దర్శకత్వం - వెట్రిమారన్,కాస్ట్యూమ్ డిజైనర్ - ఉత్తర మీనన్, సౌండ్ డిజైన్ - టి. ఉదయ కుమార్, స్టంట్స్ - పీటర్ హెయిన్, స్టంట్ శివ,వీఎఫ్ఎక్స్ - హరిహరసుదాన్, ఆర్ట్ డైరెక్టర్ - జాకీ.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook