Vidyut Jammwal nude Pics Goes viral: శక్తి, ఊసరవెల్లి, తుపాకీ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. అతడు పేరుకి పెద్దనటుడే అయినా బయట సాదాసీదా జీవితాన్నే గడపడానికి ఇష్టపడతాడు. దాంతో ఈ యాకర్ట్ కు సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా విద్యుత్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ అంటే డిసెంబ‌ర్ 10న‌ విద్యుత్ జమ్వాల్ పుట్టినరోజు. ఈ బర్త్ డే తో ఆయన 43 వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి చేసిన ఓ పని అందరిని  షాక్‌కు గురి చేసింది. తన జన్మదినం నేపథ్యంలో హిమాలయాలకు వెళ్లిన జమ్వాల్ నగ్నంగా అడవుల్లో తిరుగుతున్నాడు. అంతేకాకుండా ఒంటిపై బట్టలు లేకుండా ఫారెస్ట్ లో సంచరిస్తూ.. వండుకుని తింటూ, స్విమ్మింగ్ చేస్తూ, సరదాగా గడుపుతున్నాడు. తాజాగా అతడి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 



'తాను సంవత్సరంలో ఏడు నుంచి 10 రోజులపాటు హిమాలయాల ఒడిలో సేద తీరుతుంటానని.. లగ్జరీ లైఫ్ ను వదిలేసి ఓ సాధువులా జీవించడానికే ఇష్టపడతానని విద్యుత్ జమ్వాల్ తెలిపాడు. ఈ ప్రకృతి ప్రసాదించే ప్రతి అణువులోనూ ఎంతో విలాసం ఉందని.. తనను తాను అన్వేషించుకోవడంలోనే నిజమైన తృప్తి ఉందని' ఎక్స్ వేదికగా ఈ నటుడు రాసుకొచ్చాడు.  


Also Read: Kalyan Ram:‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌…ఆశ్చర్యపరుస్తున్న కళ్యాణ్ రామ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి