Vijay Antony Wife : స్టేజ్ మీద కంటతడి పెట్టిన విజయ్ ఆంటోని భార్య.. ఆ రోజు ఏం జరిగిందంటే?
Vijay Antony Wife విజయ్ ఆంటోని భార్య ఫాతిమా తాజాగా కంటతడి పెట్టేసింది. తన భర్తకు జరిగిన ప్రమాదం, నాటి రోజులు గుర్తు చేసుకుంటూ ఏడ్చేసింది. అభిమానుల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఆయన బతికి ఉన్నారని చెప్పుకొచ్చింది ఫాతిమా. ఈ ప్రేమతోనే సినిమాను కూడా హిట్ చేయాలని కోరింది.
Vijay Antony Wife బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. బిచ్చగాడు సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వంద రోజులకు పైగా ఆడేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయింది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు 2 సినిమా మే 19న రాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని భార్య ఫాతిమా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
మలేషియాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్‌కి ప్రమాదం జరిగిందని, సడెన్‌గా మేనేజర్ కాల్ చేశాడని నాటి సంగతులు గుర్తు చేసుకుంది. మేడం మేడం అంటూ కాల్ చేశాడట. మామూలుగా అయితే చెన్నైలో ఉంటే ఫోన్ చేయడని చెప్పుకొచ్చింది. సార్‌కి యాక్సిడెంట్ అయిందని, స్పృహలో కూడా లేడని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడట. ఏం జరిగిందో అర్థం కాని ఫాతిమా మళ్లీ మళ్లీ ఫోన్ చేసిందట. కానీ కాల్ లిఫ్ట్ చేయలేదట. విజయ్‌ని అప్పుడు హాస్పిటల్‌కు తీసుకెళ్లే హడావిడిలో ఉన్నారేమో అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది ఫాతిమా.
అయితే ఆ క్షణంలో తన జీవితం ఇక అయిపోయిందని అనుకుందట. కానీ అభిమానుల నుంచి ప్రేమ, ఆశీస్సులు రావడంతో తనకు నమ్మకం కుదిరిందట. అభిమానులు ఇచ్చిన ధైర్యంతోనే తాను నిలబడినట్టుగా, ఆయన ప్రాణాలతో మళ్లీ తిరిగి రావడానికి కారణం కూడా అభిమానులే ప్రేమ అని చెప్పుకొచ్చింది. అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని కంటతడి పెట్టేసుకుంది. బిచ్చగాడు సినిమాని ఎలా అయితే బ్లాక్ బస్టర్ చేశారో.. రెండో పార్ట్‌ను కూడా అలానే బ్లాక్ బస్టర్ చేయాలని కోరింది.
Also Read: Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?
ఇక విజయ్ మాట్లాడుతూ.. ఆ ప్రమాదం తన వల్లే జరిగిందని, తాను చేసిన తప్పు వల్లే ఆ ప్రమాదం జరిగితే.. హీరోయిన్ కావ్య తనను కాపాడిందని చెప్పుకొచ్చాడు. తనను కాపాడే ప్రయత్నంలో కావ్య మొహానికి గాయం కూడా అయిందని, అయినా లెక్కచేయకుండా తనను కాపాడిందని విజయ్ చెప్పుకొచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook