Vijay Devarakonda: రష్మిక తో లవ్ కన్ఫర్మ్ చేసిన రౌడీ హీరో.. స్వీయ అనుభవం అంటూ..
Rashmika Mandanna Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నతో తనకున్న అనుబంధం గురించి ఇటీవలే ఓపెన్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు రూమర్స్ అనుకుంటున్న ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.
Vijay Devarakonda Confirms Love: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయిన ఈయన, ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినా రష్మిక మందన్నతో ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వినిపించాయి.
దీనికి తోడు వీరిద్దరూ ఎక్కువగా వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే రష్మిక మందన్న దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ఈమె నేరుగా ఆ ఫోటోలు షేర్ చేయకపోయినా.. బ్యాక్గ్రౌండ్ ను బట్టి కన్ఫామ్ చేసేస్తున్నారు నెటిజన్స్. దీనికి తోడు రష్మిక కూడా పలుమార్లు విజయ్ దేవరకొండ నా ఫ్యామిలీ అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.
అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. వివాహం అనేది మహిళల కెరియర్ను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయంపై విజయ్ తన ఆలోచనలను పంచుకున్నాడు. పెళ్లి అనేది ఒకరి కెరియర్ మధ్యలో రావాల్సిన అవసరం లేదు. పెళ్లి అనేది ఆడవాళ్లకు కష్టతరమైన వ్యవహారం. అది మీరు చేసే వృత్తిపై కూడా ఆధారపడి ఉంటుంది అంటూ తెలిపారు.
ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క అబ్బాయి 20 సంవత్సరాల తర్వాత ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయం నష్టానికి దారితీస్తుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆలోచన తీరు మారుతుంది.. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమపై ఆలోచనలు మారుతాయి. ఇదేమీ చెడ్డ విషయం కాదు ..కాకపోతే ఆలోచన తీరు వయసును బట్టి మారుతుంది. స్వీయ అనుభవంతో చెబుతున్నాను అంటూ తెలిపారు.
ఇకపోతే రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. నేను ఒంటరిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? నాకు ప్రస్తుతం 35 ఏళ్లు అంటూ అడిగాడు విజయ్ దేవరకొండ. మొత్తానికైతే రష్మిక తో రిలేషన్ లో ఉన్నానని చెప్పకనే చెప్పేసారంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.