Kushi Movie Postponed: ముందు నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయింది. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో సమంత, విజయ్ దేవరకొండ తదితరులపై ఈ సినిమా షూటింగ్ జరిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇటీవల సమంత తాను అనారోగ్యం పాలయ్యానని త్వరలోనే కోలుకుంటానని చెబుతూ తాను ఒక వ్యాధి బారిన పడ్డానని ఆ వ్యాధి పేరు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరగగా అది నిజమే అని తేలింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ధ్రువీకరించారు. ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.


వాస్తవానికి సినిమాని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు సమంత అనారోగ్యం పాడిన పడటంతో పాటు మరికొన్ని కారణాలు కూడా మీద పడడంతో సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విజయ్ దేవరకొండ చెబుతున్నారు. కానీ దాన్ని సమ్మర్ సీజన్ కి వాయిదా వేసేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.


ఇక ఈ ఇంటర్వ్యూలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఒకప్పుడు సమంతను సినిమాల్లో హీరోయిన్ గా చూసేందుకు కాలేజీ ఎగ్గొట్టి మరీ వెళ్లేవాడినని అలాంటి ఆమెతో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఆమె ఒక అద్భుతమైన నటి అని అలాంటి నటితో పని చేయడం తన కెరీర్ లోనే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ గతంలో విడుదలైన కొన్ని ఫోటోలను బట్టి చూస్తే అతను కాశ్మీర్ కి చెందిన వ్యక్తిగా సమంత అతనితో ప్రేమలో పడినట్లుగా కథ రాసుకున్నారు అనే ప్రచారం ఉంది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సినిమా విడుదల అయితే కానీ చెప్పలేం.


Also Read: KGF on Rahul Gandhi: రాహుల్ గాంధీకి కేజీఎఫ్ ఎలివేషన్స్.. కేసు వేసిన కేజేఎఫ్ టీమ్.. మామూలు షాక్ కాదుగా ఇది!


Also Read: Nandamuri Balakrishna Remuneration : బాలయ్య రెమ్యూనరేషన్ మరీ అంత తక్కువా?.. చిరంజీవిని అందుకోలేనంత దూరంలో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook