Vijay Deverakonda Love Proposal: సడెన్ సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన అమ్మాయి!
Lady Fan Proposed to Vijay Devarakonda in Liger Promotions. తేజు అనే ఓ యువతి తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు.
Lady Fan Theju Proposed to Vijay Devarakonda in Liger Promotions: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ దేశాన్ని చుట్టేస్తున్నాడు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఇప్పటికే పలు నగరాలు సందర్శించిన రౌడీ హీరో.. తాజాగా బెంగళూరుకు వెళ్ళాడు. అక్కడ రౌడీ హీరోకు ఓ యువతి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
తేజు అనే ఓ యువతి తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. తన ఫేవరెట్ హీరోను డైరెక్టుగా చేసేసరికి తేజుకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి తన వద్ద ఉన్న రింగ్ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఎవరి దిష్టి తగలకూడదంటూ మోకాలిపై నిలబడి ప్రపోజ్ చేశారు. యువతి అభిమానానికి రౌడీ హీరో ఫిదా అయిపోయాడు. వెంటనే తేజును దగ్గరకు తీసుకుని హత్తుకుని ఓదార్చాడు.
విజయ్ దేవరకొండ ప్రపోజ్‌కు సంబందించిన వీడియోను తేజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. 'మై బేబీ, మై మ్యాన్ విజయ్ దేవరకొండ. ఎవరి దిష్టి తగలకుండా ఉంగరంతో ప్రపోజ్ చేసాను. లైగర్ మూవీ ప్రమోషన్లు పూర్తయ్యే వరకూ ఆ ఉంగరాన్ని తీయనని విజయ్ నాకు మాటిచ్చాడు. నువ్ చాలా స్వీట్, బై తేజు అని చెప్పాడు' అని తేజు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'విజయ్ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్ అయిపొయింది', 'పాపం రష్మిక మందన్న' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Sun rises in Antarctica: నాలుగు నెలల తర్వాత సూర్యోదయం.. ఎక్కడో తెలుసా?
Also Read: Horoscope Today 23 August 2022: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రెండు రాశుల వారికి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook