Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిన్న అంటే జూలై 26 కి ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అది సినిమాలో ఉన్న కామియో అపీరియన్స్ గురించి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డియర్ కామ్రేడ్ సినిమాలో ఒకరు కామియో పాత్రలో కనిపించారు. ఆమె మరెవరో కాదు విజయ్ దేవరకొండ తల్లి మాధవి. నిజానికి ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె కనిపించేది చాలా తక్కువ సమయం మాత్రమే. 


ఒక సీన్లో విజయ్ దేవరకొండ తల్లి కాలేజ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు. కనిపించేది కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. అలా కళ్ళు మూసి తెరిచే లోపల ఆమె పాత్ర మాయమైపోతుంది. అందుకనే ఈ విషయాన్ని అందరూ గుర్తించలేకపోయారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక స్టూడెంట్ పొలిటిషియన్ పాత్రలో కనిపించగా.. రష్మిక మందన్న ఒక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తుంది. 


ఇక సినిమా విడుదల ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రష్మిక మందన్న సినిమా గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేశారు. "నేరేషన్ చెప్పినప్పటి నుంచి మొదలైన జర్నీలో నెలల పాటు క్రికెట్ ట్రైనింగ్, దెబ్బలు, నొప్పి, సినిమా ప్రమోషన్లు, నుంచి ఈ సినిమా విడుదల అయ్యేదాకా.." అంటూ తన జర్నీని ఫాన్స్ తో పంచుకుంది రష్మిక. 


మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఈ సినిమా 30 కోట్ల దాకా వసూళ్లు నమోదు చేసుకుంది.


Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ


Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి