Rashmika-Vijay Devarakonda: ‘నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను’.. రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లై
Rashmika-Vijay: విజయ్ దేవరకొండ రౌడీ కల్చర్ తో పోస్ట్ చేసిన అలయ్ బలయ్ సాంగ్ ను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనిపై విజయ్ తన స్టైల్లో స్పందించాడు.దీంతో మరొక సారి ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చలు షురూ అయ్యాయి.
Vijay Devarakonda Reply for Rashmika Mandanna: విజయ్ దేవరకొండ సినిమాలలో హీరో గానే కాకుండా మంచి బిజినెస్ మాన్ గా కూడా దూసుకుపోతున్నాడు.
అతను స్టార్ట్ చేసిన బిజినెస్లలో రౌడీ క్లబ్ పేరుతో ప్రారంభించిన బట్టల బిజినెస్ కూడా ఉంది. విజయ్ దేవరకొండ ఈ బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను రౌడీ కల్చర్ పేరుతో భారీగానే చేస్తున్నాడు . ఈ నేపథ్యంలో ఓ వినూత్నమైన పద్ధతితో మంచి మ్యూజికల్ టచ్ ఇస్తూ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్.
సింగర్ రామ్ మిర్యాల ఆలపించిన అలయ్ బలయ్.. సాంగ్ తన రౌడీ కల్చర్ కు సెట్ అయ్యే విధంగా రౌడీ క్లబ్ డ్రెస్ లలో మరొకసారి రీమేక్ చేసి తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ పోస్ట్ చేసిన రౌడీ కల్చర్ సాంగ్ బాగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోని రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి గురించి పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా రష్మిక విజయ్ పోస్ట్ చేసిన వీడియోని స్టోరీ గా పెట్టడం మరింత వైరల్ గా మారింది.
విజయ్ పోస్ట్ చేసిన అలయ్ బలయ్ సాంగ్ తన స్టోరీలో షేర్ చేసిన రష్మిక.. అసలు నీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి.. నీ ప్లే లిస్ట్ నేను ఎప్పటినుంచో అడుగుతున్నాను.. ఇప్పుడు చూడు మొత్తం ప్రపంచం నీ ప్లే లిస్ట్ చూడాలనుకుంటుంది. ఈ సాంగ్ వైబ్ సూపర్ గా ఉంది. నేను నా ఫేవరెట్ సింగర్ లిస్ట్ ఇస్తాను ప్లీజ్.. రామ్ మిరియాల నువ్వు చాలా అద్భుతంగా పాడావు అంటూ తన మనసులోని భావాలను ఎక్స్ప్రెస్ చేసింది. ఎంతో ఎమోషనల్ గా రష్మిక షేర్ చేసిన ఈ స్టోరీని విజయ్ తన స్టోరీలో షేర్ చేశాడు.
అంతేకాదు .. నీకు నా ప్లే లిస్ట్ మీద బాగా జెలస్ ఉన్నట్టు ఉంది. ఇది మ్యూజిక్, సింగర్స్ మీద ఉన్న ప్రేమను నేను షేర్ చేసుకునే టైం.. సరే ఇంతకీ నీ టాప్ 3 ఇండియన్ ఆర్టిస్ట్స్ ఎవరో చెప్పు.. నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్. ఇలా ఒకరి గురించి ఒకరు ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు రాసుకోవడం.. ఒకరి స్టోరీలను ఒకళ్ళు పోస్ట్ పెట్టడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా గా మారింది. వీలు పెట్టే స్టోరీలలో కూడా ఎంతో అండర్స్టాండింగ్ దాడి ఉంది అని నెటిజన్స్ భావిస్తున్నారు.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
Also Read: VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్‌నెస్ టెస్టులు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి