Vijay Deverakonda - Anand Deverakonda: అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యువ హీరో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం పెద్దగా తగ్గలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా మారిన ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మధ్యనే బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా అనుకున్నాడు. 


దేవరకొండ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కెరియర్ లో బాగానే ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందా అని అభిమానులు ఎప్పటినుంచో చర్చించుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆనంద్ దేవరకొండ కి ఎదురైంది. 


వివరాల్లోకి వెళితే ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా సినిమా మే 31న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు ఆనంద్. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆనంద్ ని తన అన్న విజయ్ తో కలిసి ఏదైనా మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉందా అని ప్రశ్న అడిగారు. 


దానికి ఆనంద్ దేవరకొండ, "ఇప్పటిదాకా మా మధ్య అలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదు. చేస్తే బాగానే ఉంటుందేమో కానీ.. సెట్ లో మా అన్నయ్య ఉంటే నేను యాక్ట్ చేయలేను. కొంచెం షేక్ అవుతాను. గతంలో చెక్ మేట్ అనే ఒక నాటకంలో థియేటర్ ఆర్టిస్టులుగా నటించాము. నేను అందులో విలన్ పాత్ర చేశాను. సినిమాలలో మల్టీ స్టారర్ అంటే ఎప్పటికీ జరుగుతుందో తెలియదు కానీ జరిగితే మంచిదేగా" అని అన్నారు.


దీంతో అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలోనే వీళ్లిద్దరూ కలిసి నటించారా అని ఆశ్చర్యపోయారు. ఉదయం అయినా సినిమాలలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. ఆనంద్ దేవరకొండ కూడా దీని గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు కాబట్టి విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి మల్టీ స్టారర్ చేసే అవకాశాలు లేకపోలేదు. సరైన కథ దొరికితే ఇద్దరు హీరోలు వెంటనే ఓకే చెప్తారేమో. మరి అలాంటి కంటెంట్ ఉన్న కథ వీరికి ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి