Vijay deverakonda video on  cyber frauds: ఇటీవల కొన్నిరోజులుగా సైబర్ మోసాలు దారుణంగా పెరిగిపోయాయి. కొంత మంది మీ బంధువులు, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ వాళ్ల డీపీలు పెట్టుకుని అర్జంట్ గా డబ్బులు కావాలని వాట్సాప్ మెస్సెజ్ లు చేస్తున్నారు. మరికొందరు ఏదో ఒక లింక్ లు పంపి భారీ మోసాలకు తెరతీస్తున్నారు. అంతే కాకుండా.. ఇటీవల మీ అకౌంట్ కేవైసీ అప్ డేట్ చేయాలని, ఆధార్ నంబర్ అప్ డేట్ చేయాలని కూడా ఫెక్ కాల్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఏకంగా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని కూడా చెప్పి మోసాలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇక మరికొందరు క్యూట్ గా అమ్మాయిల్లా మాట్లాడి.. హనీ ట్రాప్ కు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే.. ఫెక్ మెస్సెల్ లను కూడా పంపుతు.. మనీ ట్రాన్స్ ఫర్ అయినట్లు లేనీ పోనీ మెస్సెజ్ లు పంపి, అవతలి వాళ్లను మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం  ఇలాంటి మోసాల బారిన పడిన వాళ్లలో చదువుకున్న వాళ్లే ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గించే అంశంగా మారింది.


ఈ నేపథ్యంలో రౌడీస్టార్ విజయ్ దేవర కొండ తాజాగా.. ఒక వీడియోను తన ఇన్ స్టాలో రిలీజ్ చేశారు. ముఖ్యంగా సైబర్ మోసాల మీద ఆయన అవగాహాన కల్పించారు. ఇటీవల తన స్నేహితుడికి కల్గిన  అనుభవంను పంచుకున్నారు. తన ఫ్రెండ్స్ కు ఫెక్ కాల్ వచ్చిందని.. డబ్బులు కూడా జమా అయినట్లు మెస్సెజ్ చూపించినట్లు కూడా విజయ్ చెప్పారు. ఆ సమయంలో తాను పక్కనే ఉన్నానని..ఆ మెస్సెజ్ చూసి..మరల యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకుంటే.. అది ఫ్రాడ్ కాల్, మెస్సెజ్ అని తెలీందని అన్నారు.


Read more: Niharika: అల్లు అర్జున్ వివాదం.. సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించిన మెగాడాటర్.. ఏమన్నారంటే..?


ఈ క్రమంలో ఎవరైన మీకు కాల్స్ చేసి లేదా మెస్సెజ్ ల రూపంలో డబ్బులు గురించి ట్రాన్స్ ఫర్ అయిందని చేప్తే..  యూపీఐ లేదా బ్యాంక్ అకౌంట్ లను చెక్ చేసుకొవాలన్నారు. ఫెక్ కాల్స్ వస్తే.. పిచ్చోడిలా కన్పిస్తున్నానా..?.. అంటూ అవతలివారికి కౌంటర్ వేయాలని కూడా విజయ్ దేవర కొండ  సైబర్ మోసాల మీద అవగాహన కల్గించేవిధంగా  ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.