VD12 Leaked Photos: అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ హీరోగా.. పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత మాత్రం ఫ్యామిలీ సినిమాలే చేశాడు. గీత గోవిందం వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆ తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి లాంటి ఫ్యామిలీ సినిమాలలో ఎక్కువగా కనిపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యనే నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అదే కోవకి చెందుతుంది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. దీంతో విసిగిపోయిన విజయ్ దేవరకొండ.. ఈసారి సరికొత్త లుక్కుతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 


VD12 అనే వర్కింగ్ టైటిల్ తో.. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి.. లీక్ అయిన కొన్ని ఫోటోలు ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లీక్ అయిన ఫోటోలలో విజయ్ దేవరకొండ.. ఊర మాస్ లుక్కుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 


ప్రస్తుతం శ్రీలంకలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. అక్కడ షూటింగ్ సెట్స్ మీద విజయ్ దేవరకొండ.. పూర్తిగా ట్రిమ్ చేసిన జుట్టుతో, గడ్డంతో మాస్ లుక్ తో కనిపించాడు. ఒక ఫోటోలో ఒక కళ్ళజోడు పెట్టుకొని.. స్టైల్ గా ఫోటోకి పోజ్ ఇచ్చిన విజయ్.. మరొక ఫోటోలో బండిమీద ఎవరో ఒక వ్యక్తి వెనుక.. కూర్చొని బీచ్ పక్కన వెళ్తూ కనిపించాడు.


 



ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ ఎప్పుడు అలాంటి మాస్ లో కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని.. అభిమానులలో ఆసక్తి మొదలైంది. రొటీన్ ఫ్యామిలీ కథలకి దూరంగా ఉంటుంది అని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ విషయం కొంచెం ఫాన్స్ కి ఊరటనిచ్చింది. 


గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి విజయ్ దేవరకొండ మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. దీని గురించి చిత్ర బృందం రియాక్ట్ అవుతూ.. థియేటర్లలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి అయిపోయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ గురించి అప్డేట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లీకైన ఫోటోల గురించి మాట్లాడుతూ.. తాము అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడవలసిందిగా అభిమానులను కోరారు దర్శక నిర్మాతలు.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter