LIGER Hunt Theme Out : `లైగర్` హంట్ థీమ్ విడుదల.. వేటాడే సింహంలా విజయ్ దేవరకొండ
LIGER Hunt Theme Out : సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం లైగర్. `సాలా క్రాస్‌బ్రీడ్` ఉప శీర్షిక. విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది.
LIGER Hunt Theme Out : సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం లైగర్. 'సాలా క్రాస్‌బ్రీడ్' ఉప శీర్షిక. విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ హంట్ థీమ్ లో విజయదేవర కొండ వేటాడే సింహాలా కనిపించారు. విజయ్ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఒక యూనివర్సల్ స్టార్ లా కనిపించారు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ స్టన్నింగ్ గా వుంది. సిక్స్ ప్యాక్ దేహంతో బాక్సింగ్ రింగ్ లో శత్రువుని మట్టికరిపించే యోధుడిలా కనిపించారు.
ఈ హంట్ థీమ్ ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది. "బతకాలంటే గెలవాల్సిందే... ఎగరాలంటే రగలాల్సిందే... నువ్వు పుట్టిందే గెలిచెటందుకు.. దునియా చమడాల్ వలిచెటందుకు.. అది గుర్తుంటే ఇంకేం చూడకు.. ఎవడు మిగలడు ఎదురుపడెందుకు.. ఛల్ లైగర్.. హంట్.." అంటూ.. హంట్ థీమ్ కోసం భాస్కరభట్ల రాసిన ఈ మాటలు ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మొత్తానికి లైగర్ హంట్ థీమ్ మూవీపై మరింత అంచనాలు పెంచింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా కనిపిస్తుండగా.. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు శర్మ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్షన్ చేయగా జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ చేస్తున్నారు. కేచ స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
Also Read - Sarkaaru Vaari Paata Ticket Rates : టికెట్ ధరల పెంపుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook