Vijay Devarakonda: ‘వీడీ 12’మూవీ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా రేసులో వెనకబడ్డాడు. అయినా.. విజయ్ దేవరకొండ సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ సైమా హ్యాపీ మూమెంట్స్ అంటూ తన నెక్ట్స్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండ తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో తన తమ్ముడు నటించిన ‘బేబి’ సినిమాకు పలు అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేసారు. సైమా హ్యపీ మూవ్ మెంట్స్ అంటూ లేటెస్ట్ ట్వీట్ లో పోస్ట్ చేశారు. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ అందుకున్నారు. హీరో ఆనంద్ దేవరకొండకు బేబి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్ అవార్డ్ దక్కింది. సైమా వేడుకల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
అవార్డ్స్ ప్రెజెంటేషన్ తర్వాత సందీప్ వంగా, ఆనంద్ దేవరకొండతో హ్యాపీ మూవ్ మెంట్స్ షేర్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఫొటోస్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ ట్వీట్ లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ - నాకు ఇష్టమైన డైరెక్టర్ సందీప్ వంగాకు సైమా సెన్సేషన్ అవార్డ్ రావడాన్ని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ఈ యేడాది ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ‘గీత గోవిందం’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పేట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో విడుదలై డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గుండూ కూడా చేయించుకున్నాడు. అందుకే బయట టోపితో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ఇందులో స్పై ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మరోవైపు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. అది కూడా తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. మొత్తంగా విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడు.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.