Kushi Movie Collections: విజయ్ దేవరకొండ నయా మూవీ 'ఖుషి'(Kushi Movie). శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ ఎట్టకేలకు సాలిడ్ హిట్ కొట్టాడు. మూవీ రిలీజ్ కు ముందు నుంచే పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ డే రూ.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా రూ.20 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. వీకెండ్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైత్రీ మూవీ మేక‌ర్స్ తెరకెక్కించిన ఈ మూవీలో ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ సంగీతాన్ని అందించాడు. ఖుషి మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


ఖుషి సూపర్ హిట్ సాధించడంతో మూవీ టీమ్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. విజయ్ దేవరకొండతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, చిత్రయూనిట్ కూడా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారిని అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.  అయితే ద‌ర్శ‌నం అనంత‌రం విజయ్ దేవరకొండ నేరుగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి వెళ్లి ఫ్యాన్స్ కలిసి సినిమా వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 



Also Read: Maanas Engagement: బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook