Vijay`s GOAT: విజయ్ `ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం` రిలీజ్ డేట్ ఖరారు.. ఆ పండుగ రోజున రానున్న హీరో..
GOAT Release Date: విజయ్ ఈ మధ్యనే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న `ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ విడుదల చేశారు సినిమా యూనిట్..
Vijay GOAT: తమిళ్ స్టార్ హీరో విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఫ్యాన్స్.. ఆయన సినిమాల కోసం మరింత ఎదురు చూడటం మొదలుపెట్టారు. అందుకు ముఖ్య కారణం ఇంకా ఒకటి లేదా రెండు సినిమాలు చేసి తన సినీ కెరీర్ కి ఎండ్ కార్డు వేస్తానని విజయ్ తెలియజేయడం. అందుకే ప్రస్తుతం విజయ్ చేయబోతున్న సినిమాల పైన మరింత ఎక్కువ ఆసక్తి నెలకొంది. 2026 తమిళనాడు అసెంబ్లీ బరిలో దిగాలని సిద్దమవుతూ ఈ లోపు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేయాలని ఉన్నాడు హీరో విజయ్.
ఈ క్రమంలో విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో AGS ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వస్తున్నా విజయ్ 68వ సినిమా పైన ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ అనే టైటిల్ ని గతంలో ప్రకటించారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.
గత కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి విజయ్ డ్యూయల్ రోల్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నట్టు వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1971లో డిబి కూపర్ అనే ఒక వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్ తో దూకేసాడు. ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికి దొరకలేదు. ఇక ఈ మిస్టరీని బేస్ చేసుకొని ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు అనే రూమర్స్ కూడా తెగ వినిపిస్తున్నాయి. ఇక వీటన్నిటి మధ్య ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్.
విజయ్ సైడ్ ఫేస్ చూపిస్తున్న పోస్టర్ విడుదల చేసి.. సెప్టెంబర్ 5న ఈ సినిమాని తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ చెయ్యనుందామని ప్రకటించాడు .సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి కూడా ఉండటంతో ఈ సినిమాని ఈ పండగ కానుకగా నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ చిత్రం ఈ తమిళ హీరో కెరియర్ లో ఎలాంటి విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి.
Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్.. ఇలా ప్రచారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter