Vijay Sethupathi in Jr Ntr's next movie: ఎన్టీఆర్ తరువాతి సినిమాలో విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. డబ్బింగ్ చిత్రాలతో ఎప్పుడో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన విజయ్ సేతుపతి 2021 ఆరంభంలో వచ్చిన ఉప్పెన మూవీతో (Uppena movie) మరింత సుపరిచితం అయ్యాడు. తన విలనిజంతో ఉప్పెన సినిమాపై తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ తమిళ హీరోను మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారక్, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కోసమే ప్రశాంత్ నీల్ వెళ్లి విజయ్ సేతుపతికి కథ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు మార్కెట్‌పై కన్నేసిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కూడా తారక్ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్టు టాక్. అదే కానీ జరిగితే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ మరింత పెరగడం మాత్రమే కాదు.. ఆడియెన్స్‌కి కన్నుల పండుగ కూడా అవుతుంది.


ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో (Prabhas) చేస్తున్న సలార్ మూవీ పూర్తి చేసుకోగానే తారక్‌తో చేయనున్న సినిమా పట్టాలెక్కనుంది. ఆలోగా తారక్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ (RRR Movie shooting) ముగించుకుని ఫ్రీ అవనున్నాడు.