Sankaranthi 2023 Movies : ఓవర్సీస్ మార్కెట్లో దారుణంగా బాలయ్య.. ఆ హీరోల ముందు చిరు కూడా చిత్తేనా?
Veera Simha Reddy Overseas rights బాలయ్యకు ఓవర్సీస్‌లో అంత మార్కెట్ ఉండదు. అఖండ సినిమా అక్కడ బాగానే ఆడినా కూడా మిలియన్ల క్లబ్బులోకి చేరలేదు.
Veera Simha Reddy Overseas rights : చిరంజీవి, బాలయ్యలు సంక్రాంతి సీజన్‌కు పోటీ పడటం కొత్తేమీ కాదు. కానీ ఈ సంక్రాంతి సీజన్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఒకరే. మైత్రీ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించింది. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారుతోంది. థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోన్నారు. మధ్యలో దిల్ రాజు వారసుడు అంటూ తన డబ్బింగ్ సినిమాను రుద్ద బోతోన్నాడు. విజయ్ సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండే ఉంది. అందుకే వారిసు సినిమా తమిళ చిత్రమని చెప్పినా కూడా వారసుడుగా తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.
టాలీవుడ్‌లో ఇలా ఉంటే.. ఇప్పుడు కోలీవుడ్‌లో పరిస్థితి ఇంకోలాఉంది. అజిత్, విజయ్ సినిమాల మధ్య ఉండే పోటీని దృష్టిలో పెట్టుకుని సమానమైన థియేటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకల్‌గా పోటీ ఇలా ఉంటే.. ఓవర్సీస్‌లో మాత్రం పూర్తిగా విజయ్ డామినేషన్ కనిపిస్తోంది. ఓవర్సీస్ లెక్కలు, బిజినెస్ చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
విజయ్ వారిసు సినిమాకు రూ. 35 కోట్లు పలికితే.. అజిత్ తునివు సినిమాకు రూ. 13 కోట్ల పలికిందట. ఇక మన తెలుగు హీరోలైన బాలయ్య, చిరు సినిమాలు తక్కువ రేట్లకు అమ్ముడుపోయింది. అందులోనూ బాలయ్య చివరి స్థానంలోనే ఉన్నాడు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు రూ. 5.5 కోట్లు అయితే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు రూ. 8.5కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
మరి వీటిలో ఓవర్సీస్ మార్కెట్లో ఏది బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందో చూడాలి. టాలీవుడ్‌లో తమిళ హీరోల హవా ఉంటుంది. కానీ కోలీవుడ్‌లో మాత్రం మన తెలుగు హీరోల సందడి మాత్రం కనిపించదు. అదే మ్యాజిక్. కోలీవుడ్‌లో చిరు, బాలయ్య సినిమాలేవీ విడుదల కావు. కానీ అజిత్, విజయ్ సినిమాలు మాత్రం సంక్రాంతి సీజన్లోకి వచ్చేస్తుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook