Vijay Varma-Tamannaah Bhatia’s Romantic Kissing Scene: గత కొద్దిరోజులుగా విజయ్ వర్మ, తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని నేరుగా ఖండించకపోవడంతో వీరి ప్రేమ వ్యవహారం దాదాపుగా నిజమని అందరూ నమ్ముతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా వీరిద్దరి లిప్ కిస్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళదాం పదండి. లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ త్వరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సెకండ్ పార్ట్ లో అమృతా సుభాష్, అంగద్ బేడి, కాజోల్, కుముద్ మిశ్రా, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, తమన్నా భాటియా, తిలోత్తమ షోమ్ మరియు విజయ్ వర్మ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది.


Also Read: Samantha Ruth Prabhu: టర్కిష్ బాత్ తో రిలాక్స్ అవుతున్న సమంత


ఇక ఈ లస్ట్ స్టోరీస్ సెకండ్ పార్ట్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన వెంటనే విజయ్ మరియు తమన్నా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు . ఈ టీజర్ ల్లో విజయ్ తమన్నా నుదిటిపై ముద్దు పెట్టినప్పుడు ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ 2ని నలుగురు దర్శకులు-అమిత్ రవీందర్నాథ్ శర్మ, ఆర్. బాల్కీ, కొంకణా సేన్ శర్మ మరియు సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేశారు.


ఒక నిమిషంలోపు నిడివి ఉన్న ఈ టీజర్‌లో పలు ఆసక్తికరమైన షాట్స్ ఉన్నాయి. అయితే మిగతా అన్ని విషయాల కంటే విజయ్, తమన్నా భాటియా మ్యాటరే చర్చ జరుగుతోంది. ఇక తమన్నా ప్రస్తుతానికి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అందుకే ఆమె ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తోంది. ఇక తమన్నా- విజయ్ వర్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి కూడా సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే వారి వివాహం ఎప్పుడు జరగనుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.  ఇక లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుండి Netflixలో ప్రసారం కానుంది.


Also Read: Adipurush Theaters: హనుమంతుడితో కలిసి ఆదిపురుష్ చూద్దాం.. సరికొత్త ప్లాన్ తో రిలీజ్?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి