Vijaykanth: తమిళ్ లో మంచి స్టార్ డం ఉన్న హీరో విజయ్ రీసెంట్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ అయ్యాక ఇక సినిమాలు కూడా చేయబోరు అని టాక్.ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ మూవీ గోట్‌ లో విజయ్ కాంత్ కు నివాళులు అర్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంకేతిక పరంగా మనం ఎంతో ముందంజలో ఉన్నాము. ప్రస్తుతం ఎక్కడ చూసినా విరివిగా వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించుకొని ఏఆర్ రెహమాన్ దివంగత లెజెండరీ సింగర్స్ వాయిస్ ని రీక్రియేట్ చేయడానికి పూనుకున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరిగా ఏఐని ఉపయోగించి విజయ్ గోట్ మూవీలో విజయ్ కాంత్ పాత్రను క్రియేట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించగా వారు తమ సమ్మతిని తెలియజేసినట్లు టాక్.


గోట్ మూవీలో విజయ్ రెండు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఒక టైమ్ ట్రావెలింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో విజయ్ చిన్నతనం పాత్ర విజయకాంత్ సెగ్మెంట్లో ప్రదర్శించబడుతుందట. ఈ మూవీలో విజయ్ ని 18 ఏళ్ల కుర్రవాడిగా చూపించడం కోసం భారీ గా ఖర్చుపెట్టి విఎఫ్ఎక్స్ ను ఉపయోగిస్తున్నారు. రెండు విభిన్న కాలాలలో సాగే ఈ చిత్రంలో 1990 కాలం నాటి స్టోరీ టైం లో విజయ్ కాంత్ అతిధి పాత్రలో కనిపిస్తారని అంచనా. నిజంగా ఇది విజయ్ కాంత్ కు ఘన నివాళి అర్పించడంతో సమానమని అతని అభిమానులు భావిస్తున్నారు.


భారీ బడ్జెట్ తో తరకెక్కుతున్న ది గోట్ ..గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్..మూవీ  సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, యోగి బాబు ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని వేసవి సెలవులకు విడుదల చేయడానికి మేకర్స్ అని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ మునుపెన్నడూ చూడనంత వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారని టాక్.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also read: Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనా


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook