Vikram Cobra Movie Twitter Review: మహాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్ ఇప్పుడు కోబ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో విక్రం సుమారు 9 పాత్రలలో నటించడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. వాస్తవానికి సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కావాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ సినిమా ఎలా ఉంది అనేదానిమీద ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో రివ్యూ ఇస్తున్నారు. ఇక దాదాపుగా రివ్యూలు అన్ని గనుక చూస్తే పాజిటివ్ రివ్యూలే ఈ సినిమాకి కనిపిస్తున్నాయి. కోబ్రా సినిమా ఒక మంచి థ్రిల్లర్ అని ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బాగుందని చూసిన వాళ్ళు అంటున్నారు.


ఇక ఫస్ట్ ఆఫ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఒక రేంజ్ లో ఉందని అంటున్నారు. తమిళ అభిమానులైతే చాలాకాలం తర్వాత విక్రమ్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుందని బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించడానికి విక్రమ్ సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందనే టాక్ బయటకు వస్తోంది. దర్శకుడి అద్భుతమైన డీటైలింగ్ కి ఫిదా అయ్యామంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


ముఖ్యంగా విక్రమ్ వేసిన కొన్ని గెటప్పులకు సంబంధించిన మేకప్ అద్భుతంగా కుదిరిందని, అయితే కొన్ని సీన్లు కత్తిరిస్తే బాగుండేదని కొంతమంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కంక్లూషన్ కూడా బాగుందని తమ అభిప్రాయాల్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని విక్రమ్ డిఫరెంట్ లుక్స్ లో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడని ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సంగీతం కూడా సినిమాని ఎలివేట్ చేసిందని అంటున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి సినిమాకు అసెట్ అని కూడా అంటున్నారు. అలాగే సినిమాకు ఉన్న కాస్టింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని స్క్రీన్ ప్లే కూడా బాగుందని అంటున్నారు. అయితే కొంత లాగ్ ఉన్నా కూడా సినిమా మీద ఇంటర్వెల్ బ్లాక్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుందని అంటున్నారు.












Also Read: Shreya Dhanwanthary Hot Photos: ఒక రేంజ్ లో రెచ్చిపోయిన తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి


Also Read: Cobra Movie First Review: కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. దుమ్ము రేపిన విక్రమ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook