Vikram Rathode Teaser review: విజయ్ ఆంటోనీ... తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం ఉంది. టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి (ViJay Antony) అలాంటి పేరే, అలాంటి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. బిచ్చగాడు చిత్రం నుంచే విజయ్ ఆంటోనీ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా విజయ్ ఆంటోనీ చేస్తున్న అప్‌కమింగ్ సినిమా విక్రమ్ రాథోడ్. తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ అనే సినిమాను తెలుగులో విక్రమ్ రాథోడ్ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది. విక్రమ్ ఠాగూర్ ప్రమోషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా విక్రమ్ రాథోడ్ టీజర్ (Vikram Rathode Telugu Teaser) విడుదల చేశారు. 



Also read : RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్- వేడుక ఎప్పుడంటే?


విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో సురేష్ గోపీ, కరోనావైరస్ కష్టకాలంలో జనం చేత రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ ఆంటోని సరసన రెమ్య నంబీశన్ జంటగా (Actress Remya Nambeesan) నటించింది.


విక్రమ్ రాథోడ్ టీజర్ చూస్తే... పోలీసులకు ముచ్చెమటలు పట్టించే పాత్రలో విక్రమ్ రాథోడ్‌గా విజయ్ ఆంటోనీ (ViJay Antony) కనిపించనున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. విక్రమ్ రాథోడ్ పోలీసులకు ఓ పెద్ద సవాలుగా ఎందుకు మారాల్సి వచ్చిందనే ఆసక్తి రేకెత్తించే విధంగా ఈ సినిమా టీజర్ కట్ చేశారు. అయితే, అంతిమంగా విక్రమ్ రాథోడ్ స్వయంగా ఓ పోలీసు ఆఫీసర్ అనే ట్విస్ట్ ఇందులో దాగుందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.


Also read : Casting Couch: సౌత్ మూవీ మేకర్స్ నడుము, ఎదభాగాల కొలతలు అడిగారు.. శర్వానంద్ హీరోయిన్ సంచనల వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook