Villagers burn snake alive on funeral in chattisgarh: చాలా మంది పాములను దైవంగా కొలుస్తారు. పాములు కన్పిస్తే వాటిని అపకారంతలపెట్టరు. వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాముల్ని పట్టుకుని వెళ్లి అడవుల్లో వదిలేయాలని చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పాముల పట్ల సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. పాములు కన్పిస్తే లేనిపోనీ వేశాలు వేస్తుంటారు. పాములకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూసేందుకు భయంకరంగా ఉంటాయి. మరికొన్ని మాత్రం.. బాబోయ్ అనేలా కూడా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో పాముల ఘటనలకు చెందిన అంశాలు ఎప్పుడు వార్తలలో ఉంటాయి. మెయిన్ గా పాములు, కొండ ప్రాంతాలు, పొలాలు, చెట్లు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. మన ఇళ్లలో వడ్లు, బియ్యం బస్తాల దగ్గర పాములు కొన్నిసార్లు ఎలుకల కోసం వస్తుంటాయి. ఈ క్రమంలో కొంత మంది తరచుగా పాముల కాటుకు బలౌతుంటారు. ఛత్తీస్ గఢ్ లో కూడా పాముకాటు ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


ఛత్తీస్ గఢ్ లోని కోర్బాజిల్లాలో ఒక విషపూరీతమైన పాము బైటపడింది. అది సదరుగ్రామస్తుడైన దిగేశ్వర్ రాథియా అనే వ్యక్తిని శనివారం ఇంట్లో కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వ్యక్తిని ఆస్పత్రి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. అయితే.. గ్రామస్తులు సదరు వ్యక్తి అంత్య క్రియల్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారంతా పాము మీద కోపంతో ఊగిపోయారు.


అంతేకాకుండా.. పాము కాటు వేసిన ఇంటికి వెళ్లి దాని వెతికి పామునుపట్టుకున్నారు. పామును ఒక కర్రకు కట్టేసి.. శాడిజంగా ప్రవర్తించారు. పామును  ఒక చితిపేర్చి దాని మీద సజీవంగా మనిషిని కాలబెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘాతుకం వీడియోలు కూడా రికార్డు చేశారంట.  విషపూరిత పాము వేరొకరిపై దాడి చేస్తుందని.. భయాందోళనకు గురై చితిపై కాల్చినట్లు గ్రామస్తులు తెలిపారు.


Read more: Viral video: బాప్ రే.. కదులుతున్న ట్రైన్ లో పదడుగుల పాము హల్ చల్.. బెదిరిపోయిన ప్రయాణికులు.. ఎక్కడంటే..?


ఈ ఘటనపై కోర్బా సబ్ డివిజనల్ అధికారి ఆశిష్ ఖేల్వార్‌ను ప్రశ్నించగా, పామును చంపిన గ్రామస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పర్యావరణ వ్యవస్థకు సరీసృపాలు ముఖ్యమైనవి కాబట్టి పాములు, పాముకాటు నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చేయాలన్నారు. పాముల్ని మాత్రం ఇలా సైకోలుగా ప్రవర్తించడం సరికాదన్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.