Allu Arjun: పుష్పరాజ్‌కు అరుదైన గౌరవం.. మూడో టాలీవుడ్ హీరోగా ఘనత!
Allu Arjun : పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ఇంతకీ ఐకాన్ స్టార్ కు దక్కబోయే గౌరవం ఏంటంటే..
Allu Arjun Wax Statue : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకోబోతున్నాడు. లండన్ లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ హీరోగా పుష్పరాజ్ నిలుస్తాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు కావాల్సిన కొలతలను ఇచ్చేందుకు అల్లు అర్జున్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ వార్త తెలిసి బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్నాడు. పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీతోనే బన్నీ, రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 కోసం ఆడియెన్స్ తోపాటు సినీ ప్రముఖలు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవిశీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఓర్మాక్స్ అనే మీడియా సంస్థ బాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాల గురించి సర్వే నిర్వహించగా.. ఇందులో పుష్ప 2 టాప్ లో నిలిచింది.
Also Read: Rathika-Prashanth: వారిద్దరి మధ్య లవ్ మళ్లీ మెుదలైంది.. ఇదిగో వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook