Vishal: పందెంకోడి చిత్రంతో తెలుగులో తనకంటూ అభిమానులను సంపాదించుకున్న హీరో విశాల్ ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లు అందుకున్నారు.
మాస్ యాక్షన్ హీరో గా పేరుపొందిన ఈ హీరో ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘రత్నం’. ఈ సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ ఈ చిత్రానికి కో-ప్రోడ్యుసర్. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం  అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ ఈ మధ్యనే విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. 


 



ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. ఈ గ్లిమ్స్ లో తల నరికి చేత్తో పట్టుకునే విశాల్ వచ్చే సీన్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్స్ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్ . రా రా రత్నం అంటూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఫుల్ రేసీగా, పవర్ ఫుల్‌గా సాగే ఈ సాంగ్ వినగానే అందరిని మెప్పిస్తుంది అన్నడంలో అతిశయోక్తి లేదు. నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. షేన్ భాగరాజ్ గాత్రం, వివేక్ సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా అనిపించాయి.


కాగా ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. 


Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం


Also read: Ap New Pension Scheme: సంక్షేమ పథకాలతో ఎన్నికల ఏడాది ప్రారంభం, ఇవాళ్టి నుంచి 3 వేల పెన్షన్, కొత్త రేషన్ కార్డులు


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook