Vishnu Manchu Ginna Collections : మంచు విష్ణు అంటేనే సోషల్ మీడియాలో ట్రోలర్లు రెచ్చిపోతోంటారు. ట్రోలింగ్‌తో మంచు విష్ణుని ఆడేసుకుంటారు. అయితే మంచు విష్ణు కూడా ట్రోలింగ్‌ను కొన్ని సార్లు సరదాగానే తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం ఫైర్ అవుతుంటాడు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓ మోస్తరుగా పర్వాలేదనిపించేలా ఉన్నా కూడా.. ట్రోలర్లు మాత్రం పిచ్చెక్కిస్తున్నారు. అసలే కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులకు, అందులోనూ ఓవర్సీస్ ప్రేక్షకులు ఇలాంటి రొటీన్ రొడ్డ కొట్టుడు చిత్రాలను తిప్పికొట్టేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే జిన్నా మాస్ సెంటర్లలో అంతో ఇంతో ఆడొచ్చు. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లెక్కలు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తున్నాయి. ఇంత వరకు ఇలాంటి దారుణమైన పరిస్థితి, బుకింగ్స్ ఏ సినిమాకు కూడా జరిగి ఉండదని తెలుస్తోంది.


నిన్న రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా జిన్నా అత్యంత అల్పంగా రన్ అయింది. మరీ దారుణంగా పదమూడు, పదిహేను టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. కాంతారా సినిమాకు మొత్తంగా శుక్రవారం రోజు 31K డాలర్లు వచ్చాయి. కన్నడ వర్షన్‌కు 13K డాలర్లు వచ్చాయట. ఇక ప్రిన్స్ సినిమాకు 17K, సర్దార్‌కు 9.5K, పొన్నియిన్ సెల్వన్‌కు 8K, ఓరి దేవుడా సినిమాకు 8K డాలర్లు వచ్చాయట. అయితే జిన్నా మూవీకి మాత్రం దారుణాతి దారుణంగా 150 డాలర్లు వచ్చాయట. అంటే పదమూడు లేదా పదిహేను టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని తెలుస్తోంది.


అయితే జిన్నా ఓవర్సీస్‌ మొదటి రోజు లెక్కలు మరీ దారుణంగా ఉన్నాయి. మొత్తంగా పదిహేడు లొకేషన్ల నుంచి 493 డాలర్లు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. అంటే యాభై షోలు వేస్తే.. 49 టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఓవర్సీస్‌లో జిన్నా అతి పెద్ద డిజాస్టర్‌గా మిగులుతుంది. ఇలాంటి కలెక్షన్లు మరే సినిమాకు కూడా రావేమో అనేంత అట్టడుగు స్థాయిలో ఉండబోతోందనిపిస్తోంది. ఓవర్సీస్‌లో డిజాస్టర్లకే డిజాస్టర్‌గా జిన్నా నిలవబోతోందన్న మాట. మరి లోకల్ మార్కెట్లోనైనా జిన్నా హిట్‌గా నిలుస్తుందో లేదా చూడాలి. అసలే అతి తక్కువ టార్గెట్‌తో జిన్నా బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ మార్క్‌ ఐదు కోట్లు అంటూ మార్క్ పెట్టుకుని జిన్నా అతి తక్కువ థియేటర్లో విడుదలైనట్టు సమాచారాం.


(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు).

Also Read : Kalyaan Dhev Post : నాకు F అనే వర్డ్‌లో అది చాలా ఇష్టం.. కళ్యాణ్‌ దేవ్ నాటీ పోస్ట్‌


Also Read : Balakrishna Tongue Slip: బాలయ్య నోటి వెంట బూతు మాట.. పాపం నోరు జారాడుగా!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook