Vishwak Sen Ban: యువ కథానాయకుడు విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల వివాదం అంతకంతకు పెరుగుతోంది. వారిద్దరి మధ్య టీవీ డిబేట్ లో జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. లైవ్ లోనే యాంకర్ దేవీ నాగవల్లిపై విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శిస్తున్నారు. అయితే తాను ఆ పదం వాడడం తప్పేనని ఇటీవలే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పిన విశ్వక్ సేన్.. అప్పుడు ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనుకున్నాడు. అయితే ఈ వివాదం హీరో విశ్వక్ సేన్ కెరీర్ పై బ్లాక్ మార్క్ పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశ్వక్ సేన్ పై మంత్రికి ఫిర్యాదు..


హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల వివాదం ఇప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది. కథానాయకుడు విశ్వక్ సేన్ వ్యాఖ్యలపై ఆమె మంత్రికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ గా మారింది. 


ఇప్పడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హీరో విశ్వక్ సేన్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 'అశోక వనంలో అర్జున కల్యాణం' సినిమా కోసం చేసిన ఓ ప్రమోషన్ వీడియోపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం తగదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. వీలైతే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తో మాట్లాడి హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.   


ALso Read: Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!


Also Read: Neha Malik Latest Pics: రొటీన్‌కు భిన్నంగా నేహా మాలిక్.. అందాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదేలే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook