Vishwak Sen - Bhagavadgitha: ఆర్పీ పట్నాయక్ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం ఎప్పటికీ నిలిచిపోతుంది.. హీరో విశ్వక్‌సేన్..
Vishwak Sen - Bhagavadgitha:భగద్గీత ఏజ్‌తో సంబంధం లేకుండా అందరు చదివి అర్ధం కోవాల్సిన మహత్తర గ్రంథం. దాన్ని నేటి యువతకు అర్ధమయ్యేలా అత్యుద్భుతంగా రికార్డు చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప ఘనకార్యం. ఈ సందర్భంగా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయం లాంఛ్ చేశారు హీరో విశ్వక్‌సేన్.
Vishwak Sen - Bhagavadgitha: విశ్వక్‌సేన్ తాజాగా 'గామి' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ వేడుకలో భాగం కావడం ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వేదికలో పాల్గొనలంటే రాసి పెట్టి ఉండాలి. ఈ సందర్భంగా భగవద్గీత విశ్వరూప దర్శనం లాంచ్ చేయడం తన అదృష్టమన్నారు. దీన్ని వినసొంపుగానే కాకుండా విజువల్ ఫీస్ట్‌లా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత తాత్పర్యాన్ని చక్కగా రికార్డు చేసిన ఆర్పీ పట్నాయక్ కు ధన్యవాదాలు. ఘంటసాల భగవద్గీత మాదిరి ఇది నిలిచిపోతుందన్నారు.
సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..
ఇంతటి మహత్కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడనుకుంటాను. నేను కేవలం నిమిత్త మాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమయ్యేలా ఉంటుంది. వారి అనుమతితోనే నేను ఈ భగవద్గీతను రికార్డు చేశాను. నా ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతులు తెలుపుతున్నాను.
జానకీరామ్ అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ మహత్కర్యానికి పని చేశారు. ఈ వేడుకు పెట్టడానికి కారణం కూడా జానకీరామ్. మొత్తం మన పురాణాలన్నిటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. ఆయనకు మనవంతుగా సపోర్ట్ చేయాలని ఈ వేడుక ద్వారా కోరుతున్నాను. నా వంతుగా లక్ష రూపాయిలు ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
భగవద్గీత.. భగవంతుని గీత.. మన బ్రతుకు మొదలుపెట్టినపుడు వినాల్సినది. జీవితాన్ని మీరు ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా ముందుకు తీసుకెళ్లేదే భగవద్గీత. యువతను ద్రుష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే ఈ వేడుకకు ఒక యూత్ హీరో అతిధిగా వుండాలని విశ్వక్ ని పిలిచామన్నారు. ఆయన వచ్చి వేడుకలో పాల్గోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంపూర్ణ భగవద్గీతను తాత్పర్యంతో రికార్డ్ చేశాము. దేవుడు కల్పించిన ఈ అవకాశంను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ... భగవద్గీత ఆర్పీ పట్నాయక్ ప్రతిపదార్ధ తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇది చాలా బావుంది. ఎప్పటిక నిలిచిపోయే ప్రాజెక్ట్'' అన్నారు. జెకె భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook