Vishwak Sen Gaami Movie Public Talk: డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్‌సేన్.. మరో అదిరిపోయే ప్రాజెక్ట్‌ 'గామి'తో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలిసారి అఘోర పాత్రలో నటించడం.. ట్రైలర్‌ విజువల్ వండర్‌గా అనిపించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాందిని చౌదరి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.  విద్యాధర్ కాగితా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మహా శివరాత్రి కానుకగా నేడు (మార్చి 8) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. మరి విశ్వక్‌సేన్ 'గామి' ఆడియన్స్‌ను మెప్పించిందా..? ఇప్పటికే సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు..? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..? ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గామి మూవీ సూపర్‌గా ఉందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. గామి విజువల్ వండర్‌ అని.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నాడు. మ్యూజిక్ అద్భుతంగా ఉందని.. అన్నా ఏం కొట్టి తీశారంటూ రాసుకొచ్చాడు. పక్కా నేషనల్ అవార్డ్ ఫిక్స్ అయిపోండి అని పోస్ట్ పెట్టాడు. "టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు మరిన్ని ఎందుకు తీయలేకపోతోంది..? విశ్వక్‌సేన్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంది. బీజీఏం అదిరిపోయింది. VFX మనసుకు హత్తుకునేలా ఉంది. కథ ఇంట్రెస్టింగ్‌గా.. డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండాఫ్ చాలా బాగుంది. కచ్చితంగా సినిమాకు వెళ్లండి.." అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


 



 



"అందరూ ఈ సినిమాను ఎలా తీసుకుంటారో తెలియదు.. మీరు కాస్త ఓపికతో చూస్తే సెకండాఫ్ చూస్తే బంపర్ హిట్. మొదటి హాఫ్ ఇంకా చాలా బాగుంది. అద్భుతమైన బీజీఎం. చివరి 30 నిమిషాల సెకండ్ హాఫ్ సూపర్‌గా ఉంది." అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. 


 




ఇప్పుడే గామి సినిమా చూశామని.. ఇలాంటి కథను నమ్మి ఐదేళ్లు కష్టపడ్డ కార్తిక్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు. విద్యాధర్ ఇంత మంచి అవుట్ పుట్ కోసం చాలానే కష్టపడ్డాడని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ టాప్ నాచ్‌లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని పోస్టులు పెడుతున్నారు.


 




ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండాఫ్ అంత ఎంగేజింగ్‌గా లేదంటూ మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. కాస్త సాగదీసినట్టుగా అనిపించిందని.. అసలైన సీక్వెన్స్ మిస్ అయినట్లుగా అనిపించిందని చెప్పాడు. అయితే టెక్నికల్‌గా గామి మూవీ హైలెట్‌గా ఉందని.. బెస్ట్ విజువల్స్ అని పోస్ట్ చేశాడు. రీసెంట్ టైమ్‌లో ఇదే బెస్ట్ సినిమాటోగ్రఫీ అని.. సినిమాను తప్పకుండా చూడొచ్చన్నాడు.