Vishwak Sen: గామి టీమ్ తీసుకున్న సంచలన నిర్ణయం.. ఇదేమి పద్ధతి రా బాబు!
Gaami : విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన గామి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రౌడ్ ఫండింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ప్రేక్షకులను మరింత షాక్ కి గురి చేసింది.
Gaami : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్యనే గామి సినిమాతో మర్చిపోలేని హిట్ అందుకున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ మధ్యనే శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. విడుదలకి ముందు నుంచి మంచి హైప్ అందుకున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా అంచనాలకు మించి కలెక్షన్లను అందుకుంది.
మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ చిత్రం కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకుంది. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, మంచి విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తన కెరీర్ లో ఇప్పటివరకు చేయనటువంటి ఒక పాత్రలో విశ్వక్ అదరగొట్టారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి ఆరేళ్లు పట్టింది. కానీ చిత్ర బృందానికి మాత్రం సినిమా మంచి సక్సెస్ ఇచ్చింది. ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ సినిమా అని అందరికీ తెలిసిన విషయమై. ఇక సినిమా హిట్ అయిన తర్వాత చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కొన్ని క్రౌడ్ ఫండింగ్ సినిమాలు తెరకెక్కి మంచి హిట్లుగా మారాయి కానీ సినిమా హిట్ అయ్యాక వారికి వచ్చిన పెట్టుబడులను తిరిగి ఇవ్వడం ఇప్పటిదాకా ఇండస్ట్రీలో జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ గామి మూవీ యూనిట్ మాత్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. క్రౌడ్ ఫండింగ్ లో పాల్గొన్న వారిని గౌరవించి వారు సినిమాకి అందించిన పెట్టుబడులు వారికి తిరిగి ఇచ్చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
"మేము మా మైలురాయిని చేరుకున్నాము. అందుకే మీరు సినిమాపై పెట్టిన పెట్టు బడిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాము" అని గామి యూనిట్ ఇప్పటికే ఇన్వెస్టర్లకు మెయిల్ చేసింది. ఇప్పటికే డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి పేర్ల జాబితాను చిత్ర టీమ్ సిద్ధం చేసుకుంది. వారు ఇచ్చిన పెట్టుబడులతో పాటు లాభాలు కూడా వారితోనే పంచుకోనుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు కూడా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే క్రౌడ్ ఫండింగ్ సినిమాలకి కూడా గామి టీం నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని అందరూ చెబుతున్నారు.
Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్
Also Read: Fishing Ban: 'ఉప్పెన' సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ "పని" నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter