Gangs Of Godavari Collections: విశ్వక్ కెరియర్ లో మొదటిసారి ఇలా.. సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే!
Gangs Of Godavari Day 1 Collection: విశ్వక్ సేన్ హీరోగా విడుదల ఆయన లేటెస్ట్ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కొందరు ఈ చిత్రం అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటే.. మరికొందరు పెదవివిరిచారు. అయితే ఇలాంటి మాస్ సినిమాలకు రివ్యూలతో సంబంధం లేదు అని.. మరొకసారి ప్రూవ్ చేస్తూ దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ చిత్రం.
Vishwaksen: ప్రయోగాత్మకమైన చిత్రాలకు కేరోఫ్ అడ్రస్ గా మారినా మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ..మాంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం.. మెల్లిగా మాస్ ఆడియన్స్ కి ఎక్కేసింది. రివ్యూల సంగతి పక్కన పెడితే.. పబ్లిక్ టాక్ మాత్రం అదిరిపోతోంది.
అంతేకాకుండా ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. శుక్రవారంనాడు.. మూడు కొత్త సినిమాలు లైన్లోకి వచ్చాయి. అయితే ఈ మూడిటితో కంపేర్ చేసుకుంటే..విశ్వక్ సినిమా కలెక్షన్స్ పరంగా ముందుంది అని వినికిరి. ఇప్పటివరకు విశ్వక్ కెరియర్ లోని బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టిన చిత్రంగా ఈ మూవీ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రం నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల వరకు.. షేర్ రాబట్టినట్లు టోక్ నడుస్తోంది. అంటే లెక్కల ప్రకారం తీసుకుంటే బడ్జెట్లో సుమారు 40% మొదటి మూడు రోజుల్లో రికవరీ అయిపోయింది.
నైజాంలో విశ్వక్ సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ క్రేజ్ ని మరింత పెంచేసింది. ఒక నైజాంకే పరిమితం కాకుండా మొత్తం ఏపీలో ఈ చిత్రానికి దంచి కొట్టే ఓపెనింగ్స్ వచ్చాయి. ఆంధ్రాలో ఎలక్షన్స్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మంచి సినిమా పడలేదు. దీంతో డీలా పడిపోయిన సినీ లవర్స్ కు విశ్వక్ సినిమా ప్రాణం పోస్తోంది. ఏరియాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో ప్రస్తుతం విశ్వక్ మార్కెట్ వాల్యూ కూడా బాగా పెరిగిపోతుంది అని అంచనా.
ఏరియా వారిగా అందుకున్న కలెక్షన్స్ ని లెక్కలోకి తీసుకుంటే నైజాం నుంచి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు కోటి రూపాయలకు పైగా మొదటి రోజే నైజాం నుంచి షేర్లు ఈ చిత్రం ఖాతాలో పడ్డాయి. ఇక వైజాగ్ ఏరియాలో 46 లక్షలు రాగా.. ఈస్ట్ లో మరొక 28 లక్షలు, వెస్ట్6 నుంచి 24 లక్షలు విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రాబట్టింది. ఇటు గుంటూరు నుంచి 30, నెల్లూరు నుంచి 17, సీడెడ్ నుంచి 76 లక్షలు ఈ చిత్రం ఖాతాలో పడ్డాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే ఈ మూవీ మొదటి రోజే సుమారు 8.2 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీ జోరు చూస్తుంటే సెకండ్ వీకెండ్ పూర్తయ్యే లోపే పది నుంచి పదిహేను కోట్ల షేర్స్ రాబట్టి..బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేలా కనిపిస్తుంది. థియేటర్లలో కల్కి రావడానికి ఇంకా రెండు వారాల టైముంది.. ఈ రెండు వారాలు విశ్వక్ సినిమా కరెక్ట్ గా ఆడితే బాక్సాఫీస్ వద్ద ఊచకోత కన్ఫామ్ అనడంలో డౌట్ లేదు.
Also Read: Namo - Varanasi: వారణాసిలో వార్ వన్ సైడేనా..? మోదీ మెజారిటీతో గత రికార్డులు గల్లంతేనా.. ?
Also Read: Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter