Gangs of Godavari Release Date: రీసెంట్ గా విశ్వక్‌ సేన్ గామి మూవీ తో మంచి సక్సెస్ సాధించాడు. సడన్ గా వచ్చి అందరిని సర్ప్రైజ్ చేసిన ఈ చిత్రం లో విశ్వక్‌ నటన ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూ వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావలసి ఉంది. అయితే మళ్లీ ఈ చిత్రం మరొక నెల వాయిదా పడింది. గత సంవత్సరం విడుదల కావలసిన ఈ చిత్రం పలు రకాల కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. నేహా శెట్టి హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం కు కృష్ణ చైతన్య దర్శకత్వ బాధ్యతలు వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ  మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్ చిత్రంపై అంచనాలను బాగా పెంచాయి. మరి ముఖ్యంగా ఇందులోని సుట్టంలా సూసి పోకల అంటూ సాగే పాట యూత్ లో బాగా వైరల్ అయింది. ఒక ఈవెంట్ లో ఈ సాంగ్ కు నేహా శెట్టితో కలిసి  విశ్వక్‌ ఓ రేంజ్ లో స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. గామి మూవీ సడన్గా లైన్లోకి రావడంతో అనుకోకుండా గాంగ్స్ అఫ్ గోదావరి తిరిగి వాయిదా పడింది. అయితే గామి మార్చిలో విడుదల అయితే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏప్రిల్ లో విడుదలవుతుంది అని ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో విశ్వక్ తెలిపాడు.


 



తాజాగా నేడు దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన డేట్స్ ప్రకటించడం తో ఈ చిత్రం మరొక నెల వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రాన్ని మరొక నెల రోజులు వాయిదా వేశారు. ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ తాజాగా మూవీకి సంబంధించిన కొత్త డేట్ ని కూడా తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మే 17న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది అని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. గోదావరి జిల్లాలలోని రాజకీయ నేపథ్యంలో సాగే ఈ పిరియాడిక్ డ్రామా కోసం మే 17 వరకు ఎదురు చూడాల్సిందే. మరి అప్పటికైనా ఈ మూవీ విడుదలవుతుందా లేక ఎప్పటిలా తిరిగి వాయిదా పడుతుందా అన్న విషయం పై స్పష్టత లేదు.


Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు


Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter